AP CEO: పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టిన వీడియో.. ఎలా బయటకు వచ్చిందో చెప్పిన సీఈఓ! పాల్వాయి పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతి నుంచో ఆ వీడియో బయటకు వెళ్లిందన్నారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేశారు. By Nikhil 23 May 2024 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి AP CEO On Pinnelli Ramakrishna Reddy EVM Break Video: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వసం చేసిన ఘటనపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో ఆయన పలు విషయాలను వెల్లడించారు. సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సర్కిల్ ఇన్స్పెక్టర్ల టీం పనిచేస్తోందన్నారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లడం ఇప్పుడు మంచిది కాదన్నారు. Also Read: మాచర్ల ఘటనలపై సజ్జల సందేహాలు.. ఆ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలని ఈసీకి డిమాండ్! ఇప్పుడే అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. తెలుగుదేశం నేతలు వెళ్తే, వైసీపీ నేతలు కూడా తాము పరామర్శకు వెళ్తామంటారన్నారు. దీంతో మళ్లీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్నారు. బయటి నాయకులు ఎవ్వరూ పరామర్శకు వెళ్లకూడదన్నారు. ఎవ్వరినీ ఆ గ్రామాల్లోనికి వెళ్లనీయవద్దని తాను సూచించినట్లు చెప్పారు. పరామర్శలకు కూడా వెళ్లకూడదన్నది తన సలహా అని అన్నారు. పాల్వాయి పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో, ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లిందన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూంలను పరిశీలించేందుకు వెళ్తానన్నారు. #pinnelli-ramakrishna-reddy #ap-ceo-mukesh-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి