Chandrababu 4th Time CM: అది 2019, మే 23.. ఏపీ వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లకు విపరీతమైన బాధ కలిగించిన రోజు..! తెలుగుదేశం కేడర్‌ను నిరాశ కమ్మేసిన కాలమది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైనట్టు ఫలితాలు వచ్చాయి. ఇది చంద్రబాబుకు భారీ ఎదురుదెబ్బ. ఇక టీడీపీ కోలుకోదని.. చంద్రబాబు పనైపోయిందని విశ్లేషణలు మొదలయ్యాయి. సీన్ కట్ చేస్తే.. 2024 జూన్ 4.. తెలుగుదేశం దుమ్మురేపింది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. దీంతో నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ఎలా పని చేస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పూర్తిగా చదవండి..CM Chandrababu: పడి లేచిన కెరటం.. నాలుగోసారి సీఎంగా చంద్రబాబు రికార్డు.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే!
2019 ఎన్నికల్లో పరాజయం తర్వాత ఎక్కడా కుంగిపోలేదు చంద్రబాబు.. గోడకేసి కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. పదునైన వ్యూహాలతో ఈ ఎన్నికల బరిలోకి దిగి వైసీపీని ఓడించి మరోసారి సీఎంగా ఏపీ ప్రజలను పాలించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా స్పెషల్ స్టోరీ!
Translate this News: