AP Assembly TDP Fight : తీవ్ర గందరగోళం మధ్యే అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైసీపీ(YCP) చర్చ ప్రారంభించింది. అయితే ముందుగా ప్రజా సమస్యలపై చర్చించాలని తెలుగుదేశం పట్టుబట్టింది. చర్చ జరగాల్సిందేనంటూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు టీడీపీ(TDP) నేతలు. ఈ క్రమంలో గవర్నర్ ప్రసంగ ప్రతిని చించి విసిరారు. దీనిపై వైసీపీ మండిపడింది. ఆ తర్వాత గవర్నర్‌తో ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని ఆరోపించిన టీడీపీ సభ నుంచి వాకౌట్ చేసింది.
అదే సమయంలో టీడీపీ నేతలపై స్పీకర్ యాక్షన్ తీసుకున్నారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో టీడీపీ సభ్యులను తమ్మినేని సీతారాం(Tammineni Seetaram) సస్పెండ్ చేశారు. టీ బ్రేక్ ఇచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందనుకుంటే అది కూడా జరగలేదు. టీ బ్రేక్ తర్వాత టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తూ నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు తమ్మినేని ప్రకటించారు.
AP Assembly : ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. గవర్నర్ ప్రసంగ ప్రతిని చింపి టీడీపీ రచ్చరచ్చ!
అసెంబ్లీలో విజిల్స్ వేసిన టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో టీడీపీ సభ్యులను తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
New Update
Advertisment