/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vishaka-1.jpg)
Vishaka: రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూములతో పాటు పేదల భూములను దోచుకుంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా దేశపాత్రునిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
Also Read: శ్రీశైలంలో తృటిలో తప్పిన ప్రమాదం.. హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో..
గ్రామంలోని 400 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్ ల్యాండ్స్ జిరాయితి భూములపై అదే గ్రామానికి చెందిన గంటల మూలారావు అనే వ్యక్తి రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి రికార్డులకు ట్యాంపరింగ్ చేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Also Read: ఒంగోలు కలక్టరేట్ వద్ద AISF ఆందోళన.. తమకు న్యాయం చేయాలని విభిన్న ప్రతిభావంతుల డిమాండ్..!
దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవట్లేదు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సిన రికార్డ్ లను సైతం మాయం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం ఆన్లైన్ లో రికార్డులను తారుమారు చేసి బినామీ పేర్లను నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.