TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు..!

రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను పునరుద్ధరణ చేశారు.

New Update
TTD Board: రద్దయిన టీటీడీ బోర్డు....24 మంది సభ్యుల రాజీనామా!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి ఉంటుంది ? అనే అంశాలపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Also read: మా మొదటి ప్రాధాన్యత ఇదే.. 6 నెలల్లో ఇళ్లు పూర్తి చేస్తాం: గంటా శ్రీనివాసరావు

అలాగే, టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్లను పునరుద్ధరణ చేసింది. టోకెన్ తీసుకున్న భక్తులు 1200 మెట్టు వద్ద కౌంటర్ లో టోకెన్ స్కాన్ చేసుకోవాలని నిబంధన విధించింది. లేకుంటే దర్శనాలకు అనుమతించమని టీటీడీ ప్రకటించింది.

Also Read: ప్లీజ్.. మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి.. వాలంటీర్ల ఆందోళన.!

గతంలో శ్రీవారి మెట్టు వద్ద టోకెన్లు తీసుకుని వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. భక్తుల అవసరాన్ని దళారులు, ట్యాక్సీ డ్రైవర్లు సొమ్ము చేసుకుంటున్నారని గుర్తించిన టీటీడీ ఈఓ.. పాత పద్ధతినే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు మార్గంలో ప్రస్తుతం రోజుకు 2500 టోకెన్లతో ట్రైయల్ రన్ అవుతోంది. త్వరలో 6వేల టోకెన్లకు పెంచనున్నట్లు వెల్లడించింది. తాజా నిర్ణయంతో దళారులకు టీటీడీ చెక్ పెట్టింది.

Advertisment
తాజా కథనాలు