Also Read: బాచుపల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. సుత్తి, కత్తి సాయంతో కాలు, చేయిని సగం వరకు నరికి..!
ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాల సమయంలో వజ్రాలు దొరుకుతాయి. దీంతో ప్రతి ఏటా ఇక్కడ వజ్రాల కోసం స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటారు. తాజాగా, కర్నూలు జిల్లాలోని పంట పొలాల్లో మరో వజ్రం దొరికింది. పత్తికొండ నియోజకవర్గం మదనంతపురం గ్రామంలో ఓ రైతుకు పొలంలో వజ్రం దొరికింది. పెరవలికి చెందిన వ్యాపారి రూ. 20 లక్షలు పెట్టి వజ్రాన్ని కొనుగోలు చేశారు.
Also Read: టాలీవుడ్ నటి హేమకు బిగ్ షాక్.. నోటీసులు ఇచ్చిన బెంగళూరు పోలీసులు..!
అయితే, గతంలోనూ రైతులకు వజ్రాలు దొరికిన సంఘటనలు చాలానే చూసాం. వర్షాల సీజన్ కావడంతో చాలా మంది అసలు పనులు పక్కన పెట్టి మరీ వజ్రాల వేటలో పడ్డారు. ప్రతీ సంవత్సరం ఇక్కడ వారికి కనీశం ముప్పై నుండి నలభై వజ్రాలు లభిస్తాయి . వజ్రాలు లభించినవారి జీవితం ఊహించని విధంగా మారిపోతుంది .