/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-15T145412.041.jpg)
Pawan Kalyan: ఆంద్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలను మాట్లాడారు. పేదల ఆకలి తీర్చడానికి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
కాకినాడ పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంలో తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్@PawanKalyan #Aadya #ViralPhoto #IndependenceDaySpecial #RTV pic.twitter.com/LPlL7QSaNf
— RTV (@RTVnewsnetwork) August 15, 2024
కూతురు ఆద్యతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ
అయితే ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్ కూతురితో కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. ఇది చూసిన పవన ఫ్యాన్స్ 'సో క్యూట్', 'అడోరబుల్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.