Mother's Milk: బిడ్డకు సరిపోగా.. 25 ప్యాకెట్ల తల్లిపాలను దానం చేసిన మహిళ

విజయవాడకు చెందిన తేతలి దివ్య అనే మహిళా 25 ప్యాకెట్ల తల్లిపాలను మదర్స్ మిల్క్ బ్యాంక్ కి డొనేట్ చేశారు. గతనెల రోజులుగా తన బిడ్డకు సరిపోగా మిగిలిన పాలను డీ ఫ్రిడ్జ్ లో భద్రపరిచి ఆంధ్రా హాస్పిటల్‌లోని మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌కు శనివారం అందజేశారు.

New Update
Vijayawada women donated mothers milk

Vijayawada women donated mothers milk

Mother's Milk: విజయవాడకు చెందిన దివ్య అనే మహిళ గొప్ప మనసు చాటుకున్నారు. తల్లి పాలు దొరకక ఇబ్బంది పడుతున్న ఎంతో మంది నవజాత శిశువుల కోసం 25 ప్యాకెట్ల తల్లిపాలను మదర్స్ మిల్క్ బ్యాంక్ కి డొనేట్ చేశారు. దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆక్వా కంపెనీకి మార్కెటింగ్‌ హెడ్‌గా పని చేస్తున్న దివ్య రెండు నెలల క్రితం పాపకు జన్మనిచ్చారు. కాగా, గత నెల రోజులుగా  ఆమె తన బిడ్డకు సరిపోగా మిగిలిన పాలను డీప్ ఫ్రిడ్జ్ లో భద్రపరుస్తూ వచ్చారు. ఒక్కో ప్యాకెట్ 250 ml  చొప్పున 25 ప్యాకెట్లను ఆంధ్రా హాస్పిటల్‌లోని మదర్‌ మిల్క్‌ బ్యాంక్‌కు  అందజేశారు.

నమ్రత మిల్క్ బ్యాంక్ 

మిల్క్ బ్యాంక్ ప్రతినిధులు పాలను పరీక్షించి తీసుకెళ్లారు. పుట్టిన వెంటనే తల్లి లేక ఇబ్బంది పడే పసివారికి ఈ పాలను ఉపయోగిస్తారు. అయితే ఇటీవలే హీరో మహేష్ బాబు భార్య నమ్రత విజయవాడలో మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాలను భద్రపరిచి డొనేట్ చేసినట్లు దివ్య తెలిపారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు