/rtv/media/media_files/2026/01/23/hbd-nara-lokesh-2026-01-23-11-35-37.jpg)
HBD Nara Lokesh
HBD Nara Lokesh: చాలా కాలంగా రాజకీయాల నుంచి దూరంగా ఉండి సినిమాలపై దృష్టి సారించిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఒక చిన్న సోషల్ మీడియా పోస్టుతో అభిమానులను సంతోషపరచారు.
NTR Wishes to Nara Lokesh
Many happy returns of the day @naralokesh! Wishing you another incredible year ahead.
— Jr NTR (@tarak9999) January 23, 2026
నారా లోకేష్ పుట్టినరోజు (జనవరి 23) సందర్భంగా, జూనియర్ ఎన్టీఆర్ తన X ఖాతా ద్వారా లోకేష్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన శుభాకాంక్షలలో వచ్చే సంవత్సరం లోకేష్‌కు మంచి సంవత్సరం కావాలని ఆశిసిస్తున్నాను.. అంటూ వ్యక్తిగత, రాజకీయ ప్రస్తావన ఏమీ మాట్లాడలేదు, ఈ పోస్ట్ తో TDP, నందమూరి అభిమానులను ఆనందపరిచారు జూనియర్ ఎన్టీఆర్.
ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ TDP కుటుంబంతో దూరంగా ఉన్నారని, రాజకీయ విషయాల్లో మౌనం పాటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిన్న పోస్ట్ ద్వారా ఆయనకు, లోకేష్ మధ్య ఏ వ్యక్తిగత విభేదం లేదని స్పష్టమైంది.
ఫ్యాన్స్ సోషల్ మీడియాలో స్పందించి, ఈ శుభాకాంక్షలను పాజిటివ్ సంకేతంగా స్వీకరిస్తున్నారు. కుటుంబ బంధాలను గుర్తు చేసుకోవడం, సినిమాలపై ఫోకస్ సారించడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ చూపిన సానుకూలతకి అభినందనలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్ పై బిజీగా ఉన్నారు. ఈ చిన్న హృదయపూర్వక విషెస్ TDP, నందమూరి అభిమానుల కోసం ఒక ఫీల్ గుడ్ మోమెంట్ గా నిలిచింది.
Follow Us