AP: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..!

వైసీపీ నేతలకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు పిఠాపురం టీడీపీ నేత వర్మ. దళితులకు పథకాలను లేకుండా చేసిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు. దళితులపై ప్రేమ ఉంటే వారికి పథకాలను ఎందుకు దూరం చేశారు? దళితులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు.

New Update
AP: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..!

TDP Leader Varma: విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసంపై రాష్ట్ర వాప్తంగా వైసీపీ నేతలు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ ఆందోళనపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. దళితులపై వైసీపీ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. దళితుల పథకాలను లేకుండా చేసిన దుర్మార్గపు పార్టీ.. వైసీపీ అని.. అలాంటి వారు అంబేద్కర్ పై ప్రేమ ఉన్నట్టు నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

Also Read: వైసీపీ అభ్యర్థి బొత్స నామినేషన్.. టీడీపీ అభ్యర్థి ఎవరు?

గత ప్రభుత్వం దళితులపై ప్రేమ ఉంటే దళితుల పథకాలు ఎందుకు దూరం చేశారు? దళితులపై దాడులు జరిగినప్పుడు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వంగా గీత ఎంపీగా ఉన్న సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందే లేదన్నారు. అమావాస్యకి, పున్నానికి వచ్చి కార్యక్రమాలు చేశారని.. అలాంటిది ఇప్పుడు ఆమె కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.

Also Read: ప్రాణం తీసిన వాటర్ హీటర్.. ఫోన్ మాట్లాడుతూ..!

అమరావతి రాజధానిలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేయాలని గతంలో చంద్రబాబు ప్రణాళిక వేశారన్నారు. దానికి సంబంధించిన భారీ విస్తీర్ణంలో ప్రపంచంలోనే లేని ఎత్తైన విగ్రహాంతో పాటు బాల్యం, విద్యాభ్యాసం, ఆయన పడిన కష్టం, పడిన వివక్షత..రాజ్యాంగానికి సంబంధించినవి అన్ని పొందుపరిచే విధంగా ఏర్పాటు చేయాలని అనుకున్నారని.. భావితరాలకు గుర్తుండే విధంగా తీర్చిదిద్దాలని అనుకున్నారని.. అయితే, మాజీ సీఎం జగన్ తక్కువ విస్తీర్ణంలో విజయవాడలో పెట్టారని ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు