ఏపీని కులాలను వేరు చేసి చూడలేం.. పెళ్లిళ్లు దగ్గర నుంచి ఎన్నికల వరకు ప్రతీది కులం చుట్టూనే తిరుగుతుంటుంది. ఏ కులం ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది.. ఏ కులం ఎవరికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తుంది లాంటివి అక్కడ తీవ్ర చర్చనీయాంశమవుతుంటాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(AP SKILL DEVELOPMENT SCAM)లో చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ అవ్వడం.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేతను పవన్ కలవడం.. వెంటనే టీడీపీతో కలిసి వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటి చేస్తానని కుండబద్దలు కొట్టడం చకాచకా జరిగిపోయాయి. నిజానికి టీడీపీకి పవన్ ఎప్పటినుంచో నేరుగా సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఇంత డైరెక్టుగా ఎప్పుడూ మాట్లడింది లేదు. ఎందుకంటే జనసేనతో నాలుగేళ్లగా పొత్తులో ఉన్న బీజేపీ నుంచి టీడీపీ(TDP)తో కలిసి పనిచేయడం విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. టీడీపీని బీజేపీని కలిపేందుకు ఇన్నాళ్లు ప్రయత్నిస్తూ వచ్చిన పవన్(Pawan) ఇప్పుడు తన నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్పేశారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ నిర్ణయం జనసేనలో అంతర్గతంగా విభేదాలకు కారణమైందన్న ప్రచారం జరుగుతోంది. కొందరు కాపు నేతలతో పాటు ఇన్నాళ్లు జనసేనే వెంటే ఉన్న కాపు కార్యకర్తలు పవన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తుండడంతో కాపు ఓట్లే కీలకం.
ALSO READ: జగన్ సంగతి ఢిల్లీలోనే తేలుస్తా..పవన్ మాస్ వార్నింగ్..!
పవన్ నిర్ణయంపై పలు ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి.. అవేంటంటే?
➊ జనసేన పార్టీ టీడీపీతో కలిసి వెళ్ళడాన్ని మెజారిటీ కాపులు జీర్ణించుకోలేకపోతున్నారా..?
➋ కాపులకు చంద్రబాబు చేసిన మేలు ఏంటి..?
➌ వంగవీటి మోహన రంగా లాంటి కాపు నేతను పొట్టన పెట్టుకున్న టీడీపీకి పవన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు..?
➍ కాపు ఉద్యమ నేత ముద్రగడను కూడా ఇబ్బంది పెట్టింది చంద్రబాబే కదా..?
➎ చంద్రబాబు కాపులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాది నిజం కాదా?
➏ కాపులకు జగన్ రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఇచ్చిన మాట వాస్తవం కాదా?
జగన్ వైపే కాపులు ఉంటారా?
టీడీపీతో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి ఉంటే జనసేనకు కాపుల మద్దతు ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరూ(టీడీపీ,జనసేన) కలిసి పోటీ చేస్తుండడంతో మళ్ళీ కాపులు జగన్ వైపే ఉండే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అటు పొత్తుల కమిటీ చైర్మన్‌గా కేవలం నాదెండ్ల మనోహర్‌ని మాత్రమే జనసేన నియమించిడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఎవరికైనా కాపులకు ఛాన్స్ ఇచ్చి ఉండాలన్న వాదన వినిపిస్తోంది. పరోక్షంగా నాదెండ్ల మనోహర్ కమ్మ కులానికి చెందినవారని.. ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు కొంతమంది జనసైనికులు. గత ఎన్నికల్లోనూ కాపులు జగన్ వెంటే నడిచారని గుర్తు చేస్తున్నారు.
ALSO READ: ‘రంగా మరణానికి కారణమైన చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు’? గుడివాడ అమర్నాథ్ ఫైర్