AP: మారెళ్ళ గ్రామంలో సోలార్ విద్యుత్ ప్లాంట్.. 80 రోజుల్లోనే పూర్తి..! ప్రకాశం జిల్లా మారెళ్ళ గ్రామంలో 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంటును కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేశారు. By Jyoshna Sappogula 25 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి Ongole: ప్రకాశం జిల్లా మారెళ్ళ గ్రామంలో 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సోలార్ విద్యుత్ ప్లాంటును కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేశారు. ఈ ప్లాంట్ నుంచి మారెళ్ల సబ్ స్టేషన్కు విద్యుత్ అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెన్యువేబుల్ ఎనర్జీ ఉపయోగించి సోలార్ పవర్ ద్వారా వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత కరెంట్ అందివ్వడంతో పాటు గృహాలకు సబ్సిడీపై సోలార్ ప్యానల్స్ అందించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దేశంలోనే విద్యుత్ ఉత్పత్తిలో ఏపీని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సినీ నటుడు అశోక్ కుమార్ సహకారంతో విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో పర్చూరు MLA ఏలూరి సాంబివరావు, దర్శి TDP ఇంచార్జీ డా. గొట్టిపాటి లక్ష్మి, మాజీ ముఖ్యమంత్రి MLA బాచిన చెంచు గారటయ్య పాల్గొన్నారు. #ongole మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి