AP Inter Exams : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ డేట్స్ ఇవే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా రూపొందించింది. మార్చి 20 లోపు ప్రాక్టికల్స్, వొకేషనల్, థియరీ ఎగ్జామ్స్ పూర్తి చేయనున్నారు.

AP Inter Exams : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ డేట్స్ ఇవే?
New Update

Andhra Pradesh Inter Exam Schedule : ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్‌(Inter Public Exams) కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రాక్టికల్స్‌, వొకేషనల్‌, థియరీ పరీక్షలను మార్చి 20వ తేదీ లోపు పూర్తి చేయనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను కూడా రూపొందించిన ఇంటర్మీడియట్ బోర్డు.. విద్యాశాఖ ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. మార్చి తరువాత సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. పరీక్షల షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాతో అధికారులు చర్చిస్తున్నారు. వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు.

కాగా, ఇంటర్ పరీక్షలు పూర్తయిన వెంటనే.. మార్చి 21వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక పదో తరగతి పరీక్షల్లో సామాన్యశాస్త్రానికి రెండు పేపర్లు ఉండటంతో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, పదవ తరగతి ఎగ్జామ్స్‌లో ఒక పరీక్షకు మరొక పరీక్షకు మధ్య సెలవు ఇవ్వాళా వద్దా అనే అంశంపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది.

తెలంగాణ ఇంటర్ ఇగ్జామ్స్ షెడ్యూల్ కూడా వచ్చే ఛాన్స్..

రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలను మార్చి 1నుంచి ప్రారంభించేందుకు ఇంటర్ బోర్డు(Intermediate Board) కసరత్తు ప్రారంభించింది. విద్యాశాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమోదం తీసుకుని ఈ వారం రోజుల్లో పరీక్షలకు సంబంధించి టైంటేబుల్ ను విడుదల చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలకు, జవాబు పత్రాల మూల్యాంకనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈసారి కొంతముందుగానే పరీక్షలను ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది.

గతేడాది విద్యాసంవత్సరం మార్చి 15 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 1-15 మధ్య జేఈఈ మెయిన్ చివరి విడద పరీక్షలు ఉండటంతో ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత కనీస గడువు కంటే విద్యార్థులు ప్రిపేర్ అవడానికి వీలుంటుంది. దీనికి తోడు ఇంటర్ తర్వాతే 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని. ఈసారి జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభం అవ్వడంతో కనీసం మార్చి 1వ తేదీ నుంచి పరీక్షలు మొదలు పెట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లుసమాచారం. కాగా ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉండనున్నాయి.

Also Read:

ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!

పైసల్లేక పట్నం నుంచి నడిచొచ్చినా.. రూపాయి చిక్క దొరికితే బస్సు ఎక్కిన: జగ్గారెడ్డి

#ap-students #ap-inter-exams #ap-inter-exams-schedule #ap-inter-exams-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe