AP Assembly Highlights: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ అలా మొదలైందో లేదో.. రచ్చ రచ్చ నడుస్తోంది. విపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుపట్టారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు. పోడియం దగ్గరకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

AP Assembly Highlights: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా..
New Update

Andhra Pradesh Assembly Highlights: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు(Andhra Pradesh) ప్రారంభమయ్యాయి. సభ అలా మొదలైందో లేదో.. రచ్చ రచ్చ నడుస్తోంది. విపక్ష నేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ(TDP) నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుపట్టారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు. పోడియం దగ్గరకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

విపక్ష నేతల ఆందోళనలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై చర్చకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుందామన్నారు. ప్రతిసారి అర్థంపర్థం లేని వాయిదా తీర్మానం ఇచ్చి సభను అడ్డుకోవాలనుకోవడం సరికాదంటూ టీడీపీ సభ్యులకు చురకలంటించారు మంత్రి బుగ్గన. ప్రభుత్వం వేసే ప్రశ్నలకు టీడీపీ వాళ్‌ల దగ్గర సమాధానం ఉంటుందా అని ప్రశ్నించారు బుగ్గన.

బాలకృష్ణకు అంబటి రాంబాబు వార్నింగ్..

అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌పై దాడికి యత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఓ ఎమ్మెల్యే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు అంబటి. జాగ్రత్త.. ఇబ్బందులు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. బాలకృష్ణ ఇక్కడ మీసం మెలేయడం కాదు.. దమ్ముంటే రా చూసుకుందాం అంటూ బాలకృష్ణకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.

  • Sep 21, 2023 12:40 IST
    బాలకృష్ణా.. నీ ఫ్లూటు అక్కడ ఊదు.. మంత్రి రోజా మాస్ వార్నింగ్..

    టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి రోజా మాస్ వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన మంత్రి రోజా.. అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేయడంపై సీరియస్‌గా స్పందించారు. మీ బావ చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే మీసం మెలేశారా అని సెటైర్లు వేశారు. ఫ్లూటు జింక ముందు ఊదు.. జగన్ ముందు కాదంటూ బాలకృష్ణకు రోజా వార్నింగ్‌ ఇచ్చారు. ఆయన బావ చంద్రబాబు కోసం బాలకృష్ణ అసెంబ్లీలో హడావిడి చేస్తున్నాడని మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ.. అసెంబ్లీకి ఎన్ని సార్లు వచ్చారని ప్రశ్నించారు. 'షూటింగ్‌లో అమ్మాయిలకు ముద్దు పెట్టాలి.. కడుపు చేయాలని చెప్పే బాలకృష్ణ.. అసెంబ్లీకి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు.' అంటూ నిప్పులు చెరిగారు. సభలో తాము 151 మంది ఉన్నామని, టీడీపీ వారు 23 మందే ఉన్నారని పేర్కొన్న మంత్రి రోజా.. తాము కూడా వారిలా చేస్తు సభలో ఉండగలరా? అని ప్రశ్నించారు.

  • Sep 21, 2023 11:43 IST
    ముగ్గురు టీడీపీ సభ్యులు ససెషన్ మొత్తం సస్పెన్షన్..

    అసెంబ్లీలో వ్యవహరించిన తీరును తప్పుపడుతూ.. టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌ను సెషన్ మొత్తం స్పెండ్ చేశారు స్పీకర్. మిగిలిన సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు.

  • Sep 21, 2023 11:27 IST
    టీడీపీ సభ్యుల సస్పెండ్.. ఎమ్మెల్యే కోటంరెడ్డికి బయటకు లాక్కెళ్లిన మార్షల్స్..

    శాసనసభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విరామం తరువాత ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ ప్రారంభమవగా.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. సభలో టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోడియంను చుట్టుముట్టేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. దాంతో అలర్ట్ అయిన మార్షల్స్.. వారిని అడ్డుకున్నారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్. మరోవైపు టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దూసుకెళ్లారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డిని మార్షల్స్ బయటకు తీసుకెళ్లారు.

  • Sep 21, 2023 11:23 IST
    బాలకృష్ణకు అంబటి మాస్ వార్నింగ్..

  • Sep 21, 2023 11:18 IST
    టీడీపీ నేతలు కొన్ని విషయాలు అంగీకరించాల్సిందే: అంబటి రాంబాబు

    అసెంబ్లీలో టీడీపీ నేతల నిరసనపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ అయ్యారు. అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు కొన్ని విషయాలు అంగీకరించాలని అన్నారు. చంద్రబాబు 45 ఏళ్లుగా అనేక ఘోరాలు, నేరాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి.. ఏన్టీఆర్ మీద పోటీ చేస్తానని అప్పట్లో చెప్పాడని గుర్తు చేశారు. 'డబ్బు మదంతో, ఎమ్మెల్యేలను కొని సొంత మామను వెన్నుపోటు పొడిచారు. దాన్ని కూడా చంద్రబాబు సమర్దించుకున్నారు. ఓటుకు, నోటుకు కేసులో అడ్డంగా దొరికినా.. దాన్ని కూడా చంద్రబాబు సమర్దించుకుంటున్నారు. ఇప్పుడు స్కిల్ కేసులో దొరికిపోయాడు..అన్ని ఆధారాలతో, సాక్ష్యలతో పట్టుకున్నారు. శాసనసభలోనైనా.. మీరు చేసిన పాపాలు కడుక్కోండి. ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో నడుచుకోండి. టీడీపీ ఎమ్మెల్యేలే వాస్తవాలు ఒప్పుకోవాలి. సింపతీ కోసం డ్రామాలు అడకండి. దొంగ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టలేరు. చంద్రబాబు మొన్నటి వరకు దొర.. నేడు దొంగ.' అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Sep 21, 2023 10:26 IST
    సభ జరిగినన్ని రోజులు టీడీపీ అజెండా అదొక్కటే..

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ అంశం ఒక్కటే సింగిల్ అజెండాగా టీడీపీ ముందుకెళ్తోంది. అసెంబ్లీ జరిగినన్ని రోజులు అదే ఎజెండాగా కొనసాగించే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. సభ నుంచి సస్పెండ్ అయినా బయట కూడా చంద్రబాబు అరెస్ట్ పై నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు టీడీపీ నేతలు.

  • Sep 21, 2023 10:24 IST
    ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనూ సేమ్ సీన్ రిపిట్..

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ చేప్టటాలని టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలియజేశారు టిడిపి ఎమ్మెల్సీలు. టిడిపి సభ్యుల ఆందోళన నేపథ్యంలో శాసనమండలి పది నిమిషాలు వాయిదా వేశారు చైర్మన్.

  • Sep 21, 2023 10:20 IST
    పేర్నినాని, బుచ్చయ్య చౌదరి మధ్య ఇంట్రస్టింగ్ డిస్కర్షన్..

    అసెంబ్లీ లాబీలో టీడీఎల్పీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, సత్యనారాయణ రాజు-పేర్ని నాని మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సభలో జరిగిన పరిణామాలను లాబీలో పేర్ని నాని వివరించారు. బుచ్చయ్య చౌదరి తన మనస్సు చంపుకుని రాజకీయం కోసం పని చేస్తున్నారని పేర్ని అన్నారు. వెంటనే రియాక్ట్ అయిన బుచ్చయ్య చౌదరి.. తాను రాజకీయం కోసం కాదు.. రాజ్యాంగం కోసం పని చేస్తున్నాని బదులిచ్చారు.

  • Sep 21, 2023 10:15 IST
    ఏపీ అసెంబ్లీలో గందర గోళం.. వాయిదా..

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ సభ్యులు పోటాపోటీగా స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. టీడీపీ సభ్యులతో కలిసి పోడియం ఎక్కారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. దమ్ముంటే రా అంటూ అంబటికి ఛాలెంజ్ విసిరారు టీడీపీ సభ్యులు. నువ్వు రా అంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు మంత్రి అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున.

  • Sep 21, 2023 10:10 IST
    బాలకృష్ణ సైగ.. అసెంబ్లీలో మారిన సీన్..

    సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ చైర్ వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పైకి పేపర్లు విసురుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పై పెట్టిన కేసులు కొట్టివేయాలని నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రు బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పినా.. టీడీపీ సభ్యులు వినలేదు. చంద్రబాబు అరెస్ట్ తో పాటు ఇంకా చాలా అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు బుగ్గన. అయితే, స్పీకర్ ముందున్న మానిటర్ లాగేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రయత్నించారు. వెంటనే రియాక్ట అయిన మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ సభ్యుల ప్రవర్తనతో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఇలా అంబటి మాట్లాడుతుండగానే.. రండి చూసుకుందాం అంటూ బాలకృష్ణ చేతితో సైగలు చేశారు. దాంతో సభలో ఒక్కసారిగా హీట్ పెరిగింది. బాలకృష్ణ సైగలతో ఒక్కసారిగా ఆందోళనకు దిగిన వైసీపీ సభ్యులు. బాలకృష్ణ కు వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. 'బాలకృష్ణ సినిమాల్లో మీసం తిప్పుకోవాలి.. ఇక్కడ కాదు' అంటూ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. మరోవైపు బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడ గొట్టారు.

#andhra-pradesh-assembly
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe