Ananya Nagalla: అనన్య పరువు తీసిన రితూ.. ఇది కూడా తెలియదా? అంటూ నెటిజన్స్ ఫైర్..!

యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల, రితూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోకు హాజరైంది. ఇండియా ప్రెసిడెంట్ ఎవరని అనన్యను రితూ అడుగుతుంది. దానికి ఆమె ఓమై గాడ్ అని షాక్ అయి అక్కడున్న స్టూడెంట్స్‌ను చెప్పమంటుంది. ప్రెసిడెంట్ పేరు కూడా చెప్పలేకపోవడంతో అనన్య కామెంట్స్ వైరల్ గా మారాయి.

Ananya Nagalla: అనన్య పరువు తీసిన రితూ.. ఇది కూడా తెలియదా? అంటూ నెటిజన్స్ ఫైర్..!
New Update

Ananya Nagalla: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది ఈ భామ. గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ‘మల్లేశం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పదహారణాల అచ్చమైన తెలుగు అమ్మాయి అనన్యా నాగళ్ల . ‘ప్లే బ్యాక్’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్‌ సాబ్‌’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది.

ananya (19)

Also Read: శోభనం గదిలో నిజస్వరూపం బయటపెట్టిన ముకుంద.. కోపంతో మురారి పై రెచ్చిపోయిన ఆదర్శ్..!

ప్రస్తుతం అనన్య తంత్ర అనే మూవీతో ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 15న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఈ బ్యూటీ వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ బిజీగా అయిపోయింది. అయితే, తాజాగా అనన్య నాగళ్ల, రితూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ షోకు హాజరైంది.

ananya (7)

ఈ ప్రొగ్రాంకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో రితూ చౌదరి, అనన్యను ఇండియా ప్రెసిడెంట్ ఎవరని అడుగుతుంది. దాంతో, ఆమె ఓమై గాడ్ అని షాక్ అయి అక్కడున్న స్టూడెంట్స్‌ను ఆన్సర్ చెప్పమని అడుగుతుంది. వారు సమాధానం చెప్పకుండా నవ్వుతుండటంతో అనన్య ఆమె పేరు మర్చిపోయానని అంటుంది. అలాగే ఈ వీడియో వేయకండి మళ్లీ వైరల్ అయిపోతుందని సరదాగా నవ్వుతూ కామెంట్స్ చేస్తోంది. నాకు ఈ సెగ్మెంట్ ఉందని తెలియదని మాస్టర్ నేను వెళ్లిపోతాను అంటూ ఫన్నీగా అంటుంది.

ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మన ఇండియా ప్రెసిడెంట్ పేరు తెలియకపోతే ఎలా అంటూ పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. మరికొందరూ రితూ.. అనన్య పరువు తీసేసిందిగా అని కౌంటర్లు వేస్తున్నారు. ఇంకొందరూ మాత్రి అదంతా షోలో భాగంగా జనాలను నవ్వించడానికి అనన్య- రితూ అలా చేసింటారని పోస్ట్ పెడుతున్నారు.

#ananya-nagalla
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe