Ananthapuram: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరిగిన అనంతపురం జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. ఇవాళ ఉదయం జడ్పీ ఛైర్ పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒకరు మినహా జడ్పీటీసీలు మొత్తం వైసీపీ వారే ఉండటం, ఎమ్మెల్యేలంతా టీడీపీ వారు ఉండటం సర్వత్రా ఆసక్తి రేపింది. పలు అంశాల పై జడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు.
Also read: ఒలింపిక్ క్రీడలకు పేదింటి బిడ్డ దండి జ్యోతిక శ్రీ.. తండ్రి ఎమోషనల్..!
గతంలో తీర్మానాలు చేసిన వాటిని తేల్చిన తర్వాతనే సమావేశం ప్రారంభించాలని జడ్పీటీసీ లు డిమాండ్ చేశారు. గతంలో జడ్పీటీసీ లకు డిప్యూటీ సీఈవో గౌరవం ఇవ్వకుండా అవమానం చేశారని.. డిప్యూటీ సీఈవో పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు కోరారు. మరోవైపు 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి ఫిల్టర్ వాటర్ ప్లాంట్లను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పక్కన పెట్టారన్నారు.
నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ సృజల స్రవంతి వాటర్ ప్లాంట్లను ఉపయోగంలోకి తేవాలని మరమ్మత్తులు చేయించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు కోరారు. పింఛన్ ను వాలంటీర్లతో పంపిణీ చేయలేదని వైసీపీ సభ్యులు ప్రశ్నించడంతో.. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు స్పందిస్తూ ప్రభుత్వ లక్ష్యం ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం అన్నారు. మీ పార్టీకి చెందిన వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయమని మీరు ఎలా చెబుతారని.. ఇకపై వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయడం జరగదు అని బదులిచ్చారు.