Ananth Ambani Pre Wedding : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఘనంగా జరిగింది. మూడురోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు జామ్‌నగర్ లో సందడి చేశారు. అంగరంగ వైభవంగా ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల అతిథుల లిస్ట్ లో మెటా సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సిఇఒ టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సిఇఒ బాబ్ ఇగర్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బ్లాక్‌రాక్ సిఇఒ లారీ ఫింక్, అడ్నాక్ సిఇఒ సుల్తాన్ అహ్మద్ ఉన్నారు. ఇక ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కరికే ఆహ్వానం వచ్చింది. దీంతో ఆయన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక బాలీవుడ్ నుంచి ఖాన్ త్రయం హాజరయ్యారు. వీరు ఈవెంట్ మొత్తం సందడి చేశారు.
ఈ ఈవెంట్(Ananth Ambani Pre Wedding)లో సంగీత్ ఒక రేంజ్ లో నిర్వహించారు. దీనిలో భాగంగా బాలీవుడ్ త్రయం షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ 'ఆర్ఆర్ఆర్' పాట 'నాటు నాటు'పై డ్యాన్స్ చేశారు. వాళ్ళు డాన్స్ చేస్తున్న సమయంలో నీతూ అంబానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కూడా స్టేజి మీద డాన్స్ చేయడానికి రావలసిందిగా ఆహ్వానించారు. దీంతో ఆయన కూడా వెళ్లి ఖాన్స్ తో కలిసి డాన్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు ఒరిజినల్ పాటకు ఎంత ఎనర్జీతో స్టెప్పులు వేశారో అంతే ఎనర్జిటిక్ గా రామ్ చరణ్.. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు రెచ్చిపోయారు. ఈ మాస్ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇలా ఖాన్ త్రయం ఒకే వేదికపై డ్యాన్స్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ డ్యాన్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read: నా జీవితం పూలపాన్పు కాదు..కన్నీళ్ళు పెట్టించిన అనంత్ అంబానీ స్పీచ్
కాగా, మూడురోజుల వేడుక(Ananth Ambani Pre Wedding)ల్లో భాగంగా పెళ్ళికొడుకు అంకిత్ అంబానీ మాట్లాడిన మాటలు కూడా వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా అంబానీ కుటుంబం అందరూ తమ ఆనందాన్ని మాటల్లో పంచుకున్నారు. ఇందులో అనంత్ అంబానీ కూడా మాట్లాడాడు. ఈ సందర్భంగా తన జీవితం గురించి చెప్పుకున్నాడు. చిన్నప్పటి నుంచి తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి, తల్లిదండ్రులు తనను ఎలా సపోర్ట్ చేశారు అన్ని వివరంగా చెప్పుకొచ్చాడు. తన జీవితం పూలపాన్పు కాదని.. ఎన్నో ముళ్ళు గుచ్చుకున్నా ఓర్చుకుంటూ వచ్చానని తెలిపాడు. చాలా దుఃఖాన్ని అనుభవించానని చెప్పాడు. అయితే అన్ని వేళల్లో తల్లిదండ్రులు మాత్రం తనను సపోర్ట్ చేస్తూనే ఉన్నారని.. తాను అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారని అన్నాడు. దానికి వారికి ఎప్పుడూ రుణపడే ఉంటానని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. కొడుకు మాటలు విన్న ముఖేష్ చాలా ఎమోషనల్ అయిపోయారు. కన్నీళ్ళను ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశారు.