Love story: వృద్ధ దంపతుల 60 ఏళ్ల దాంపత్య జీవితానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ వైరల్ అవుతోంది. అమ్మమ్మ-తాతల మధ్య ఉన్న ప్రేమ, బాండింగ్, అండర్ స్టాండిగ్ కు సంబంధించి భగత్ వీడియో తీసిన వారి మనవడు అనీష్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్ దాటేసింది.
ఆమె కోసం పాట పాడిన తాత..
ఈ మేరకు అనీష్ భగత్ అనే యువకుడు తన బామ్మ, తాతల ప్రేమకు సంబంధించి మార్చి 14న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. అంతేకాదు వారిమధ్య నెలకొన్న పలు సందర్భాలను వివరంగా చూపించాడు. 'ఈ జోడి పెళ్లి రోజును ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈసారి అనారోగ్య కారణాలతో అమ్మమ్మ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అమ్మమ్మ ఆసుపత్రికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా.. అనిష్ తాతగారు ఆమె కోసం ఓ పాట పాడారు. భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండగా.. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలని మనసులోనే భగవంతుడిని ప్రార్ధించేవారు. అతడు ఇంట్లో, ఆమె ఆస్పత్రిలో ఉండగానే వారి వివాహ వార్షికోత్సవం వచ్చింది. దీంతో భార్యకు ఓ చిన్న గిఫ్ట్ పంపాలనుకున్నాడు. మనవడితో చెప్పి బహుమతి తెప్పించుకున్నాడు.
ఇది కూడా చదవండి: Viral Video: జైలు స్వర్గంలా ఉంది.. ఖైదీ లైవ్ వీడియో సంచలనం!
ప్రేమగా పంపించిన బహుమతి..
ఇక అనీష్ సహకారంతో భర్త ప్రేమగా పంపించిన బహుమతిని తీసుకున్న బామ్మ.. తెగ మురిసిపోయింది. ఆసుపత్రిలో నర్సుల సమక్షంలో కేక్ కట్ చేసి తన ఆనందాన్ని వారితో పంచుకుంది. తర్వాత భర్తకు కొన్ని పువ్వులు పంపించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం బాగుపడటంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో తాతకు వెళ్లి ఆమెను హత్తుకోవాలని ఉన్నప్పటికీ శరీరం సహకరించకపోవడంతో అక్కడే ఆగిపోయాడు. కానీ ఆమె అతడివైపు అడుగులు వేసింది. ఇద్దరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.ఇక ఈ అద్భుతమైన స్టోరినీ పంచుకన్న అనీష్.. 'నేను ఈ తరంలో ఎందుకు పుట్టాను? మీ అందరికీ ధన్యవాదాలు మీ ఆశీర్వాదాలను అమ్మమ్మ, తాతయ్యలకు పంపిస్తున్నాను' అంటూ పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చాడు.