Railway Property : ఇదేం పాడు బుద్ధి.. ఈ మొగుడు నాకొద్దు.. ఓ ఇంజనీర్ భార్య నిజాయితీ!

కక్కుర్తి మాస్టర్ ఆ ఇంజనీర్. ట్రైన్ ఏసీ బోగీల్లో ఇచ్చే దుప్పట్లు, దిండు కవర్లు ఎత్తుకెళ్ళి తన ఇంటిలో పెట్టెలో దాచుకున్నాడు. అది చూసిన భార్య తప్పు కదా అన్నందుకు ఆమెను హింసించాడు. దీంతో ఆమె ఆర్ఫీఎఫ్ కు సమాచారం ఇచ్చింది. టైటిల్ పై క్లిక్ చేసి పూర్తి స్టోరీ తెలుసుకోండి. 

Railway Property : ఇదేం పాడు బుద్ధి.. ఈ మొగుడు నాకొద్దు.. ఓ ఇంజనీర్ భార్య నిజాయితీ!
New Update

Railway Property : సాధారణంగా మనం చాలామంది కక్కుర్తి మనుషులను చూస్తూ ఉంటాం. వారి ఆ బుద్ధిని చూసి నవ్వుకుంటాం. ఒక్కోసారి మన మధ్యలోనే అలా కక్కుర్తిపడి పనికిమాలిన పని చేసిన వ్యక్తి ఉంటే.. దానిని చూసి కూడా మనకెందుకులే అని పెద్దగా పట్టించుకోము. ఉదాహరణకు మనం ఒక రెస్టారెంట్ కు వెళ్లాం. అక్కడ పక్క టేబుల్ లో ఒకాయన వెళుతూ వెళుతూ టేబుల్ పై స్పూన్ ఒకటి జేబులో వేసుకుని పోయాడు. ఇది చూసి మనం నవ్వుకుంటాం తప్పితే.. పెద్ద సీరియస్ గా తీసుకోము. అయితే, ఇలాంటి ఇంజనీర్(Engineer) ఒకరు ఇప్పుడు తన కక్కుర్తి పనులతో కటకటాల పాలయ్యాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అతని భార్యే మనోడి కక్కుర్తిని పోలీసులకు చెప్పడం. అవును.. నాకు ఈ దిక్కుమాలినోడు వద్దు అనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చి తన భర్తను పట్టించింది ఆ ఇల్లాలు. ఆ కథేమిటో తెలుసుకుందాం.. 

Railway Property మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ఇంజనీర్ గా పనిచేస్తున్న అర్షద్(Arshad) కు ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్ లోని కోటకు  చెందిన అఫ్సానా(Afsana) అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్ళైన తరువాత ఇద్దరూ భోపాల్ లో కాపురం పెట్టారు. భోపాల్ లోని ఎయిర్‌పోర్ట్ రోడ్‌(Airport Road) లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. అఫ్సానా తమ ఇంటిలో గత నెలలో ఇంటిని శుభ్రం చేస్తుండగా తాళం వేసి ఉన్న పెద్ద పెట్టె కనిపించింది. దాని తాళం చెవిని వెతికి ఆ పెట్టె తెరిచింది. తెరుచుకున్న పెట్టెలో ఉన్న వస్తువులను చూసి ఆమె షాక్ అయింది. అసలు తాను చూస్తున్నది ఏమిటో ఒక నిమిషం ఆమెకు అర్ధం కాలేదు. ఇంతకీ ఆ పెట్టెలో ఉన్నవి ఏమిటంటే.. ట్రైన్ లో ఏసీ బోగీలలో ఇచ్చే దుప్పట్లు, బ్లాంకెట్స్, దిండు కవర్లు, తువ్వాళ్లు. తన భర్త ఇంటికి వచ్చిన తరువాత అవేమిటి అని అడిగింది. రైలులో ప్రయాణం చేసినపుడు దొంగిలించి తెచ్చినవి అని కూల్ గా చెప్పాడు అర్షద్. 

Also Read : పెద్ద కొడుకుని రక్షించబోయి.. చిన్న కొడుకుని చేజార్చుకున్నాడు!

Railway Property ఇది తప్పు కదా? అలా ఎలా చేస్తారు? అంటూ తన భర్తను నిలదీసింది ఆమె. దీంతో కోపం వచ్చిన అర్షద్.. ఆడవారి కంటే పురుషులే గొప్పవారని, తాను చెప్పినట్లే ఆమె నడుచుకోవాలని చెబుతూ ఇంటిలో పెట్టి తాళం పెట్టాడు. తన భర్త హెచ్చరికను పట్టించుకోని అఫ్సానా మొత్తం సంఘటనను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోను అప్‌లోడ్ చేసింది. ఆ తర్వాత ఆమె భోపాల్ ఆర్‌పిఎఫ్‌కు అర్షద్ చర్యల గురించి తెలియజేసింది.

Railway Property : ఆమె ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు అర్షద్ ఇంటికి వెళ్లి.. మొత్తం 40 బెడ్‌షీట్లు, 30 టవల్స్, ఆరు దుప్పట్లు స్వాధీనం చేసుకున్నారు. అఫ్సానా అప్‌లోడ్ చేసిన వీడియోలో, అర్షద్‌కు ఉన్న ఈ అలవాటు తనకు ఇష్టం లేదని, అందువల్ల, అతను తన సలహాను పట్టించుకోకుండా తనను హింసిస్తుండడంతో విసిగిపోయి ఈ విషయాన్ని బయటపెడుతున్నానని ఆమె చెప్పింది. 

#railway-property #bhopal-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe