/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/amitabh-jpg.webp)
Amitabh Bachchan Emotional: భారతీయ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్ షోలలో 'కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC)' ఒకటి. ఈ గేమ్ షో తర్వాత దీన్ని పోలి చాలా భాషల్లో చాలా గేమ్ షోలు వచ్చాయి. అయినా KBC గేమ్ ఫో కంటే ఏదీ పాపులర్ అవ్వలేదు. ఈ షో పేరు చెప్పగానే అమితాబ్(Amitabh Bachchan) మాత్రమే అందరికి గుర్తొస్తాడు. అతని స్థానంలో ఈ గేమ్‌షోకు మరో హోస్ట్‌ని ఊహించుకోలేం. అయితే ఇక అమితాబ్ ఈ గేమ్‌షోకు గుడ్‌బై చెప్పారని తెలుస్తోంది. కేబీపీ ఫైనల్ ఎపిసోడ్ డిసెంబర్ 29న ముగిసింది. ఇదీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండగా.. సంబంధితి వీడియోలో బిగ్‌బీ చాలా ఎమోషనల్ అయ్యారు.
KBC Finale mein Amitji bayaan karte hain apne dil ki baat. Hasi, prem, aur yaadon se bhare iss anokhe safar ko yaad kiya jayega!
Dekhiye #KaunBanegaCrorepati Grand Finale,
aaj raat 9 baje, sirf #SonyEntertainmentTelevision par.#KBC15 #KaunBanegaCrorepati #KBCOnSonyTV… pic.twitter.com/slYNqDFuLJ— sonytv (@SonyTV) December 29, 2023
అమితాబే కావాలి:
అమితాబ్ లేకుండా కేబీసీని ఊహించడం ప్రజలకు కష్టం. దీంతో ఈ వీడియో చూసిన వారంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. 'కౌన్ బనేగా కరోడ్‌పతి' మొదటి సీజన్ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. షో మూడో సీజన్‌లో అమితాబ్ స్థానంలో షారుక్ ఖాన్ వచ్చారు. ఇది ప్రజలకు నచ్చలేదు. తర్వాతి సీజన్‌లో అమితాబ్‌ని మళ్లీ తీసుకొచ్చారు. ఆ తర్వాత అన్నీ సీజన్‌లకు ఆయనే హోస్ట్‌గా వ్యవహరించారు.
మరోవైపు ఈ వీడియోకు మరో కోణం కూడా ఉంది. పబ్లిసిటీ కోసం మేకర్స్ ఇంతకు ముందు కూడా ఇలాంటి పనులు చేశారంటున్నారు కొంతమంది. అయితే అమితాబ్ ఎమోషనల్ వీడియో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆఖరి ఎపిసోడ్ కి కావల్సినంత బజ్ క్రియేట్ అయింది. అంటే అమితాబ్ గానీ, మేకర్స్ గానీ షో శాశ్వతంగా మూతపడుతుందని చెప్పలేదు.
'లేడీస్ అండ్ జెంటిల్మెన్, మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. రేపటి నుంచి ఈ వేదిక అలంకరించబడదు. రేపటి నుంచి మనం ఇక్కడికి రాలేమని మా ప్రియమైన వారికి చెప్పగలగాలి. నాకు చెప్పే ధైర్యం లేదు, చెప్పాలని అనిపించడం లేదు. నేను అమితాబ్ బచ్చన్, ఈ యుగానికి, ఈ దశ నుంచి నేను చివరిసారిగా చెప్పబోతున్నాను - గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్.' అంటూ అమితాబ్ చెబుతుంటే వీడియో చూస్తున్న వారు భావోద్వేగానికి గురవుతున్నారు.
Also Read: నీళ్లు తాగుతూ కుప్పకూలిన క్రికెటర్.. చిన్నవయసులోనే ఊహించని మరణం!
WATCH: