Amitabh Bachchan: ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు..!!

‘‘ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు? అంటూ తన ఫ్యాన్స్‌పై బాలీవుడ్ బాద్ష అమితాబ్ బచ్చన్‌ ఎమోషనల్ అయ్యారు. అమితాబ్ బచ్చన్‌ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఆయన అభిమానులు రెడీ అయిపోతున్నారు. మరోవైపు కౌన్ బనేగా క్రోర్‌పతి  షో నిర్వహకులు ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్‌ను దూం దామ్‌ గా చేయాలని ప్లాన్స్‌ వేస్తున్నారు. అనేక సర్‌ప్రైజ్‌లు చేశారు. ఇది తెలుసుకున్న బిగ్‌బీ భావోద్వేగానికి లోనయ్యారు.

Amitabh Bachchan: ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు..!!
New Update

Amitabh Bachchan: ‘‘ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు? అంటూ తన ఫ్యాన్స్‌పై బాలీవుడ్ బాద్ష అమితాబ్ బచ్చన్‌ ఎమోషనల్ అయ్యారు. రేపు బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఆయన అభిమానులు రెడీ అయిపోతున్నారు.  మరోవైపు కౌన్ బనేగా క్రోర్‌పతి  షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బీ పుట్టినరోజు వేడుకలకు షో నిర్వహకులు అనేక సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారు. ఇది తెలుసుకున్న బిగ్‌బీ భావోద్వేగానికి లోనయ్యారు.

అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం కౌన్ బనేగా క్రోర్‌పతి 15వ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఐదు దశాబ్దాలుగాపైగా బాలీవుడ్ ను ఏలుతున్న బిగ్ బీ  తన 81వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. అయితే కేబీసీ షో మేకర్స్ మాత్రం ముందుగానే అతడి బర్త్ డేను సెలబ్రేట్ చేసి అక్టోబర్ 11న టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేయగా.. అందులో అమితాబ్ భావోద్వేగానికి గురవడం కనిపిస్తోంది.  నన్ను ఇంకెంతలా కంటతడి పెట్టిస్తారు అంటూ  ఎమోషనల్ అయ్యారు.  "ఇన్నాళ్లూ నేను అవతలి వాళ్లకు టిష్యూలు ఇచ్చేవాడిని.. ఇప్పుడు నాకే అవసరం అవుతున్నాయి"అని అమితాబ్ ఈ ప్రోమోలో అన్నాడు. ఈ ఎపిసోడ్ మొత్తం బిగ్ బీని సర్‌ప్రైజ్ చేశారు షో ఆర్గనైజర్లు.

publive-image

 బిగ్ బీ బర్త్ డే కోసం కేబీసీ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పద్మ విభూషణ్ సరోద్ ప్లేయర్ ఉస్తాద్ అంజద్ అలీ ఖాన్ షో కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ షోకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితోపాటు పలువురు ఇతర ఇండస్ట్రీల సినీ ప్రముఖులు అమితాబ్ కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు వస్తున్నట్లు తెలిసింది.

Also Read: ఈడీ ముందుకు నవదీప్‌!

#amitabh-bachchan #chira
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe