USA: అమెరికాలో జాతీయ రహదారిపై కాల్పుల కలకలం..! అమెరికాలో జాతీయ రహదారిపై కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కెంటకీలోని లండన్ టౌన్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఇంటర్‌స్టేట్-75 హైవేను తాత్కాలికంగా మూసివేశారు. By Archana 08 Sep 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి USA: అమెరికాలో మరో సారి జాతీయ రహదారిపై కాల్పుల కలకలం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పై ప్రయాణిస్తున్న వారి పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన కెంటకీలోని లండన్ టౌన్ ప్రాంతం దగ్గర చోటు చేసుకుంది. డేనియల్ బూన్ నేషనల్ ఫారెస్ట్ పొదలలో నుంచి రహదారి పై ప్రయాణిస్తున్న వారి పై కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రస్తుతానికి ఇంటర్‌స్టేట్-75 హైవేను తాత్కాలికంగా మూసివేశారు. జోసెఫ్ కౌచ్(32) ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఇతని కోసం అక్కడి స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన మేయర్ రాండెల్ వెడిల్ అక్కడి ప్రజలను ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని సూచించారు. ఫారెస్ట్ ఏరియా కావడంతో నిందితుడిని పట్టుకోవడం కష్టంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. Also Read: Bigg Boss Telugu 8: బేబక్క, శేఖర్ భాష ఎలిమినేటెడ్..? బిగ్ బాస్ ట్విస్ట్..! - Rtvlive.com #america #kentucky-gun-firing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి