Gun Fire: అమెరికాలో దారుణం.. స్కూల్ పిల్లల్ని..

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జార్జియా బారో కౌంటీలోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది గాయపడిన విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు.

New Update
Gun Fire: అమెరికాలో దారుణం.. స్కూల్ పిల్లల్ని..

America : అమెరికాలో మరోసారి పాఠశాలలో కాల్పులు కలకలం రేపాయి. జార్జియాలోని బారో కౌంటీలోని అపాలాచీ హైస్కూల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారని తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Also Read: టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వీడియో లీక్!

అనంతరం విద్యార్థులను పాఠశాల సమీపంలోని ఓ అథ్లెటిక్ స్టేడియానికి తరలించారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉ. 10:30 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కాల్పుల నేపథ్యంలో అపాలాచీ హైస్కూల్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం పాఠశాల ప్రాంతం పోలీసుల అదుపులో ఉందని, విద్యార్థులను చూడటానికి ఎవరు కూడా స్కూల్ వైపు రావొద్దని తెలిపింది. బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో బారో కౌంటీ షెరీఫ్ జడ్ స్మిత్ మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని , జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు