జ్ఞాపకశక్తిని పెంచుకునే చిట్కాలు! ఆకు కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవటం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్, యాపిల్స్, బ్రొకోలీ, క్యాలీఫ్లవర్ లాంటి వాటిలో సి, ఇ-విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి పెంచుతాయని సూచిస్తున్నారు. By Durga Rao 27 Jul 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. ఎందుకిలా..? మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే. మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే.. మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతాయి. ఏకాగ్రత కూడా సమకూరుతుంది. ఓ సర్వే ప్రకారం రంగురంగుల పండ్లు, కూరగాయలు తినడం అనేది మీ మెదడుకు ఎంతో మంచిది అని స్పష్టమైంది. ఎందుకంటే మొక్కలు, కూరగాయల్లో ఎక్కువగా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. తరచుగా వయసు పెరిగే కొద్దీ వృద్ధులకు మతిమరుపు వస్తుంటుంది. వారికి జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతుంది. దీంతో వారు నిరాశకు లోనవుతుంటారు. కానీ ఫ్లేవనాయిడ్స్ అనేవి చెట్లకు కాసే పండ్లకు ప్రకాశవంతమైన రంగులను ఇస్తాయి. ఈ రంగులను వృద్ధాప్యంలో ఉన్నవారు చూస్తే వారికి మతిమరుపుకు లోనయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో నిరూపితమైంది. దీర్ఘకాలం పాటు అలాంటి ఫ్లేవనాయిడ్స్ ఉండే పండ్లు, కూరగాయలు తినడం వల్ల అది మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్యారెట్లు, స్ట్రాబెర్రీలు, యాపిల్స్ సహా ఇతర పండ్లు ఉన్నాయి. క్యారెట్లలో బీటా కెరోటిన్, స్ట్రాబెర్రీలలో ఉండే ఫ్లేవోన్, యాపిల్స్‌లో ఉండే ఆంథోసైనిన్ మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తాయని, తద్వారా మెదడు ఆరోగ్యంగా ఉంటుందని సర్వేలో తేలింది.ఎర్ర ద్రాక్షలో కూడా కామన్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వేరే ద్రాక్షతో పోలిస్తే ఈ ద్రాక్షల్లో సమృద్ధిగా ఉంటాయి. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, రాస్బెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంథోసైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును బాగా ప్రభావితం చేస్తాయి. ప్రత్యేకించి మెదడులో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపకశక్తి సామర్థ్యం పెరుగుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. #2024 #first-published-july-27 #605-pm-ist మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి