Fat Tips: కష్టపడకుండానే కొవ్వును కరిగించుకునే అద్భుత చిట్కా

అధిక బరువు సమస్యతో బాధపడేవారు జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. బరువు తగ్గించడంలో నీళ్లు బాగా పనిచేస్తాయి. ప్రిజ‌ర్వేటివ్స్ ఉంటే ఆ ప‌దార్థాలు తీసుకోవ‌డం మానుకోవాలి. ఈ చిట్కాలను పాటిస్తే కొవ్వు క‌ర‌గ‌డమే కాకుండా వారంలో కిలో చొప్పున తగ్గవచ్చని నిపుణులంటున్నారు.

Fat Tips: కష్టపడకుండానే కొవ్వును కరిగించుకునే అద్భుత చిట్కా
New Update

Fat Tips: ప్రస్తుతకాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఆహారంతో బరువు తగ్గితే మరికొందరు వ్యాయామాలు చేస్తుంటారు. కొన్ని చిట్కాలను పాటిస్తే కొవ్వు క‌ర‌గ‌డమే కాకుండా వారంలో కిలో చొప్పున తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. ఆహారంలో ఎక్కువ ప్రొటీన్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. కార్బోహైడ్రేట్స్, చ‌క్కెర‌లు ఉంటే ఆ పదార్థాల జోలికి పోకూడదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా చ‌క్కెరను ఉత్పత్తి చేస్తాయి. రక్తంలో కూడా షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి.

publive-image

అంతేకాకుండా శరీరంలో వేడి ఎక్కువగా విడుదల అవుతుంది. కృత్రిమ రంగులు ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రిజ‌ర్వేటివ్స్ ఉంటే ఆ ప‌దార్థాలు తీసుకోవ‌డం మానుకోవాలి. సోడియంతో కూడుకుని ఉండటం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది. వేయించిన పదార్థాలు, జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే కడుపులో మంట వస్తుందని చెబుతున్నారు. తినే ఆహారంలో మిరియాలు యాడ్‌ చేసుకోవాలి. అంతేకాకుండా నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. బరువు తగ్గించడంలో నీళ్లు బాగా పనిచేస్తాయి. నీళ్ల వల్ల కొవ్వు కరగడమే కాకుండా బరువు కూడా తొందరగా తగ్గుతారని నిపుణులు అంటున్నారు.

publive-image

అంతేకాకుండా తగినంత నిద్ర అవసరం, నిద్రలేమి వల్ల కూడా బరువు తొందరగా పెరుగుతారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రాత్రి లేటుగా పడుకోవడం, రాత్రి సమయంలో స్నాక్స్‌ తినడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఉత్పత్తి అవుతాయి. నిద్రలేకపోవడం వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు విడుద‌లవుతాయని నిపుణులు అంటున్నారు. కనీసం 7 గంటలు పడుకోవాలి, ఉదయం లేచిన తర్వాత వ్యాయామం చేయాలి. సమయానికి మంచి ఆహారం తీసుకుంటే సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: నేల మీద ఈ వస్తువులు పెట్టారంటే ఇక అంటే..డబ్బు అస్సలు నిలవదు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#fat-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe