Alprazolam: ఆ ఔషధం తయారీ.. మైలాన్ లేబొరేటరీస్‌కి బిగ్ షాక్..! మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్‌కు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) బిగ్‌షాక్ ఇచ్చింది. ఎంగ్జైటీకి మెడిసిన్‌గా ఉపయోగించే అల్ప్రాజోలం తయారీకి సంబంధి మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్ లైసెన్స్‌ను డీసీఏ రద్దు చేసింది. ఈ తయారీ యూనిట్ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో ఉంది. By Trinath 14 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి హైదరాబాద్ సమీపంలోని తమ యూనిట్‌లో సైకోట్రోపిక్ పదార్థాన్ని అనధికారికంగా మళ్లించినట్లు గుర్తించడంతో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఫార్మాస్యూటికల్ మేజర్ మైలాన్ లేబొరేటరీస్ ఆల్‌ప్రజోలం తయారీ లైసెన్స్‌ను రద్దు చేసింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారుల ప్రకారం, మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్, యూనిట్-7 లైసెన్స్ పొందిన ప్రాంగణంలో 21.250 కిలోగ్రాముల సైకోట్రోపిక్ పదార్ధం 'అల్ప్రాజోలం'ని అనధికారికంగా మళ్లించారు. సైట్‌లో రసాయన శాస్త్రవేత్తలు, ఉత్పత్తి అధికారులుగా పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగుల ద్వారా ఇది మళ్లించబడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. భారీ ఎత్తున ఆల్‌ప్రజోలం స్వాధీనం: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని మైలాన్ యూనిట్‌లోని వినియోగ వస్తువుల గదిలో 4.850 కిలోల అల్ప్రాజోలాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. DCA తెలంగాణా మైలాన్ ల్యాబొరేటరీస్ యూనిట్-7కు షోకాజ్ నోటీసును జారీ చేసింది. అల్ప్రాజోలం అంటే ఏమిటి? అల్ప్రాజోలం అనేది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్ధం. ఎంగ్జైటీ రుగ్మతలు, భయాందోళన రుగ్మతలు, డిప్రెషన్‌తో సంబంధం ఉన్న వాటికి ఉపయోగించే మెడిసిన్. ఆందోళన, నిద్రలేమికి చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక సైకోటిక్ ఔషధం. అల్ప్రాజోలం దుర్వినియోగం ఒక వ్యసనంగా మారుతుంది. Also Read: రైతుల మీద మరోసారి టియర్ గ్యాస్…ఉద్రిక్తంగా ఢిల్లీ బోర్డర్లు WATCH: #alprazolam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి