Aloe Vera: కలబంద అందం, ఆరోగ్యాన్నే కాదు.. ఇంట్లో ధనాన్ని కూడా పెంచుతుంది.. అదెలాగంటే..!

అలోవెరాతో అందం, ఆరోగ్యమే కాదు.. సంపద, సంతోషం కూడా సిద్ధిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అలోవెరా మొక్కను ఇంటికి పశ్చిమ దిశలో నాటితే దరిద్రం తొలగిపోయి.. ఆర్థికంగా మేలు జరుగుతుందని చెబుతున్నారు.

New Update
Office Vastu : ఆఫీసు టేబుల్ పై పొరపాటునా ఈ మొక్కలు పెట్టకండి..మీ ఉద్యోగానికి ఎసరు తప్పదు..!

Aloe Vera: అలోవెరా/కలబంద గురించి మనందరికీ తెలిసిందే. అలోవెరా చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కలబందలోని ఔషధ గుణాలు.. శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అందుకే.. దీనిని ఔషధాలలోనూ, బ్యూటీ కాస్మొటిక్స్‌లోనూ ఉపయోగిస్తారు. అయితే, అలోవెరా ఆరోగ్యానికి, అందానికే కాదు.. ఇంట్లో ఐశ్యర్యాన్ని కూడా పెంచుతుందని అంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. అవును, అలోవెరా వ్యక్తి జీవితంలో పురోగతిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తుందని చెబుతున్నారు. కలబంద వ్యక్తి అదృష్టాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అలోవెరాను ఇంట్లో పెంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి.. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మరి ఇంట్లో దరిద్రం పోయి.. అదృష్టం రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జ్యోతిషశాస్త్రంలో కలబందకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురోగతిలో అడ్డంకులు ఉంటే.. అలోవెరా వాటిని తొలగిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. అలోవెరా మొక్కను ఇంటికి పశ్చిమ దిశలో నాటడం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. దీంతో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

ఇంటి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటడం వల్ల ప్రేమ జీవితంలో నెలకొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. భాగస్వాములు ఒకరి మాటలను ఒకరు గౌరవించుకుంటారు. ఒకరితో ఒకరు హాయిగా కలిసి మెలిసి జీవిసతారు. కలబంద మొక్కను సరైన దిశలో నాటితే అది ఫలవంతంగా ఉంటుంది. అయితే, పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో కలబంద చెట్టును పెట్టవద్దు. అలా చేస్తే.. అశుభంగా పరిగణిస్తున్నారు జ్యోతిష్య పండితులు.

మీరు బాల్కనీ లేదా తోటలో కలబంద మొక్కను నాటితే.. పేదరికాన్ని తొలగిస్తుంది. దీని వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించదు. కలబంద మొక్కను కొనడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని ద్వారా ఇంట్లో లక్ష్మీ దేవి ఆకర్షితమవుతుందని చెబుతున్నారు పండితులు.

Also Read:

టాలీవుడ్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్‌ ఇష్యూపై సీఎం రేవంత్ ఫోకస్..

అలాంటి వ్యక్తి సీపీగా.. సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయం..

Advertisment
Advertisment
తాజా కథనాలు