YCP - CM Jagan: నేను 'సిద్ధం'.. మీరు సిద్ధమా?.. భీమిలి నుంచి జగన్‌ ఎన్నికల శంఖారావం.. ఈ నెల 27 నుంచి సభలు

ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. ఈనెల 27నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. భీమిలిలో తొలి క్యాడర్ మీటింగ్ చేపట్టనున్నారు.

YCP - CM Jagan: నేను 'సిద్ధం'.. మీరు సిద్ధమా?.. భీమిలి నుంచి జగన్‌ ఎన్నికల శంఖారావం.. ఈ నెల 27 నుంచి సభలు
New Update

YCP - CM Jagan: ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. ఈనెల 27నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. భీమిలిలో తొలి క్యాడర్ మీటింగ్ చేపట్టనున్నారు. మరోవైపు.. ఎన్నికల శంఖారావం సభ “సిద్ధం” పోస్టర్‌ను వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. దాంతో పాటు “సిద్ధం” థీమ్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. విశాఖలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పిడికిలి బిగించిన సీఎం జగన్ ఫొటోకు ‘సిద్ధం’ అనే టైటిల్‌తో పోస్టర్లు ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: రోజా vs అనిత.. ఏపీలో మాటల యుద్ధం.. పెరుగుతున్న పొలిటికల్‌ హీట్‌

వై నాట్ 175 అని టార్గెట్‌ పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై దృష్టి పెట్టారు. త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా ఇన్‌ఛార్జ్‌ల మార్పులు చేర్పులను ఈ నెల 27 నాటికి పూర్తి చేయాలని జగన్‌ భావిస్తున్నారు. మొత్తం అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు సీఎం జగన్. ఈ నెల 27న ఉత్తరాంధ్రలోని భీమిలిలో మొదటి బహిరంగ సభలో పాల్గొంటారు జగన్‌. ఫిబ్రవరి 10 వ తేదీ లోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు.

ఎన్నికల ప్రక్రియలో పార్టీ కేడర్ కీలక పాత్ర పోషిస్తారు. అందుకే కేడర్ తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. పార్టీ అభ్యర్థుల మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది…ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి… వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏం చేయాలి..కేడర్ క్రియాశీలత వంటి అంశాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా కొత్తగా నియమించిన ఇంచార్జి లకు కేడర్ నుంచి మంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు.

#ycp #cm-jagan-bheemili-meeting
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe