TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ ...18 నుంచి ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు..!!

శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్ నెలకు సంబంధించి ఆన్ లైన్ లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటాకు సంబంధించిన వివరాలను టీటీడీ బుధవారం ప్రకటించింది. జనవరి 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది.

Tirumala: ఆరోజున స్వామి వారి బ్రేక్‌ దర్శనాలు రద్దు!
New Update

TTD :  తిరుమల వెళ్లేందుకు ప్లాన్ లో ఉన్న శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆన్ లైన్ లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను టీటీడీ బుధవారం ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన సేవల ఆన్ లైన్ లక్కీ డీప్(Online Lucky Deep) కోసం జనవరి 18 ఉదయం 10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చని టీటీడీ (TTD) తెలిపింది. లక్కీడీప్ లో టికెట్లు పొందిన భక్తులు 22న మధ్యాహ్నం 12గంటల్లోగా డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాలి.

కాగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జనవరి 22న ఉదయం 10గంటలకు రిలీజ్ చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను జనవరి 22న మధ్యాహ్నం 3గంటలకు, శ్రీవారి వార్షిక వసంతోత్సవం ఏప్రిల్ 21 నుంచి 23 వరకు జరుగుతుంది. దీనికి సంబంధించిన సేవా టికెట్లను 22వ తేదీ ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు. అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10గంటలకు విడుదల చేయడంతోపాటు  శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం..గదుల కోటాను 23 వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్ల కోటాను 24న ఉదయం 10గంటలకు రిలీజ్ చేస్తారు. కాగా తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ జనవరి 24న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు.

ఇది కూడా చదవండి: నా భార్య పిల్లలతో అయోధ్యకు వెళ్తాను..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఏప్రిల్ నెలకు సంబంధించి జనవరి 27న ఉదయం 11గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను మధ్యాహ్నం 12గంటలకు నవనీత సేవ కోటాను మధ్యాహ్నం ఒంటిగంటకు పరకామణి సేవకోటాను విడుదల చేయనున్నారు. భక్తులు వెబ్ సైట్ https://tirupatiblaji.ap.gov.in ద్వారా ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

#ttd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe