NH 65: సంక్రాంతికి విజయవాడ హైవేపై ఏపీకి వెళ్లే వారికి అలెర్ట్.. సూర్యాపేట ఎస్పీ కీలక సూచన! సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రం నుంచి జాతీయ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టారు పోలీసులు. ఆంధ్రాప్రాంతానికి వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. By Bhoomi 11 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి NH 65: సంక్రాంతి(Sankranti) పండుగ సందర్భంగా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కావున జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 65 పై ఎలాంటి రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా జిల్లా పోలీసు నివారణ చర్యలు చేపట్టడం జరిగినదని సూర్యాపేట(Suryapet) జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే(SP Rahul Hegde) తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అతివేగంతో వాహనాలు నడపరాదని.. నిద్ర మత్తులో వాహనాలు నడకూడదని సూచించారు. దూర ప్రయాణం వల్ల అలసిపోవడం, నిద్ర మత్తు కారణంగా ప్రమాదాలకు జరిగే అవకాశం ఉన్నది తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కోరారు. ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆపరాదు: వాహనాలు కండిషన్ లో ఉండాలి. చలి ప్రభావం, పొగమంచు ఉంటుంది. రాత్రి కావున ప్రయాణంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమన్నారు. అత్యవసర సమయంలో రహదారుల అధికారులను లేదా డయల్ 100 కు పొన్ చేసి సహాయం తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రక్కన అనధికారికంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు అని విజ్ఞప్తి చేశారు. బారి వాహనాలు ఒక క్రమంలో వెళ్ళాలని.. ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు ఎస్పీ కోరారు. రోడ్లపై గస్తీ : ముఖ్యంగా జాతీయ రహదారి వెంట.. సూర్యాపేట రూరల్, చివ్వెంల, మునగాల, కోదాడ మండలాల పరిధిలో గల గ్రామాల రైతులు, ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు మార్గంలో వాహనాలు, పశువులను తీసుకువెళ్లడం ప్రమాదం అని గమనించాలి అన్నారు. సిబ్బంది రోడ్లపై గస్తీ నిర్వహించాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. తప్పుడు మార్గంలో వాహనాలు నడిపినా, రోడ్లపై న్యూసెన్స్ చేసినా, ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆపితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నిత్యం వాహనాలు తనిఖీ లు చేస్తూ మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ నిరోధించాలి అని సిబ్బందిని ఆదేశించారు. ఇది కూడా చదవండి : జియో కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త.. ఆ రెండు ప్లాన్లపై అదనపు డేటా! #nh-65 #special-safety మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి