Ongole: ఒంగోలు కలక్టరేట్ వద్ద AISF ఆందోళన.. తమకు న్యాయం చేయాలని విభిన్న ప్రతిభావంతుల డిమాండ్..!

ప్రకాశం జిల్లా ఒంగోలు కలక్టరేట్ వద్ద AISF ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు నిరసన చేపట్టారు. 10 వేల మంది అంద విద్యార్థులు ఉండగా కేవలం 2000 మందికే పాఠ్య పుస్తకాలు అందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. MD కుమార్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
Ongole: ఒంగోలు కలక్టరేట్ వద్ద AISF ఆందోళన.. తమకు న్యాయం చేయాలని విభిన్న ప్రతిభావంతుల డిమాండ్..!

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులను మోసం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒంగోలు కలక్టరేట్ వద్ద AISF ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులు నిరసన చేపట్టారు. 10 వేల మంది అంద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉండగా.. కేవలం 2000 మందికే అందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆందోళన.. వైద్య సిబ్బందితో మృతుల బంధువులు వాగ్వివాదం.!

అంద విద్యార్థులకు అన్యాయం చేస్తున్న MD కుమార్ రాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత పాలనలో MD కుమార్ రాజా చేసిన నిర్వాకంపై విచారణ చేపట్టాలన్నారు. ఎంతో ఖర్చుపెట్టి తెప్పించిన బ్రెయిన్ లిపి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా పుస్తకాలను అందించాలని కోరారు. తమకు మెగా డీఎస్సీ, ఇతర కాంపిటీషన్ పరీక్షలకు సరి అయిన పుస్తకాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు