AP: ఆదివాసీల ఆందోళన.. జంగూడ - గుంజీవాడ మధ్య వంతెన నిర్మించాలని డిమాండ్..! అల్లూరు జిల్లా గుంజీవాడలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. జంగూడ - గుంజీవాడ మధ్య వెంటనే వంతెన నిర్మించాలని డిమాండ్ చేపట్టారు. వృద్దులు, గర్భిణీలు, చిన్నారులు గడ్డ దాటలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 07 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vishaka: అల్లూరు జిల్లా గుంజీవాడలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. జంగూడ - గుంజీవాడ మధ్య వెంటనే వంతెన నిర్మించాలని డిమాండ్ చేపట్టారు. వంతెన నిర్మాణం చేసి ఆదివాసీలకు రవాణా సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ గడ్డకు సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో కథనం వస్తున్నా ప్రభుత్వ వర్గాల్లో చలనం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. అధికారులకు కీలక ఆదేశాలు..! 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం రూ. 2 కోట్లతో వంతెన నిర్మాణనికి శంకుస్థాపన చేసిందని.. అయితే, నేటికీ రెండేళ్లు గడిచిన వంతెన నిర్మాణం చేయలేదన్నారు. వర్షాకాలంలో ఆదివాసీలు నిత్యావసర వస్తువులు తీసుకుని వెళ్ళేందుకు.. వంట పాత్రలతో గడ్డ దాటుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. Also Read: MPDO కార్యాలయం ఎదుట ఉద్రిక్తత.. గో బ్యాక్ ఎంపీటీసీ అంటూ టీడీపీ నిరసన..! అనారోగ్యం వచ్చిన వృద్దులు, గర్భిణీలు, చిన్నారులు గడ్డ దాటలేక ఆనపకాయ డిప్పల సాయంతో గడ్డదాటే ప్రయత్నం చేస్తున్నారని..ఈ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. తక్షణమే వంతెన నిర్మాణం చేసి రవాణా సదుపాయం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అరకు ఎమ్మెల్యే మత్యలింగం, ఎం.పీ తనూజా రాణి ఈ విషయమై తక్షణం స్పందించాలని ఆదివాసి సంఘాలు డిమాండ్ చేపట్టారు. #vishaka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి