ఇక నుంచి రాజస్థాన్ తో రాహుల్ ప్రయాణమా..?

T20 వరల్డ్ కప్ విజయం తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నద్రవిడ్. భవిష్యత్తులో అతని పయనం ఎటువైపని అభిమానుల్లో చర్చసాగుతుంది. అయితే తాజాగా ద్రవిడ్ IPL లో రాజస్థాన్ కు కోచ్ గా సేవలందిస్తారనే వార్తలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి.

New Update
ఇక నుంచి రాజస్థాన్ తో రాహుల్ ప్రయాణమా..?

భారత క్రికెట్ జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ICC T20 ప్రపంచకప్ విజయంతో తన పదవీకాలం ముగిసింది. ICC ODI వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమి తర్వాత, అతని ఒప్పందాన్ని BCCI T20 ప్రపంచ కప్ వరకు పొడిగించింది. ఈ టోర్నీ తర్వాత అతను టీమ్ ఇండియాకు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో కలిసి పని చేయవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.  2008లో ఆడిన తొలి ఐపీఎల్‌లో రాజస్థాన్ విజేతగా నిలిచింది.

రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా నుండి విడిపోయిన తర్వాత, ఇప్పుడు అతని తదుపరి ప్రాజెక్ట్ గురించి అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు. ఈ స్టార్‌ ఇప్పుడు ఏ టీమ్‌తో కలిసి పనిచేస్తాడో తెలుసుకోవాలని అందరూ ఆశక్తి తో ఎదురు చూస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, రాహుల్ ద్రవిడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కోచ్ లేదా మెంటర్‌గా తిరిగి రావచ్చు. అతను తన పాత జట్టు రాజస్థాన్ రాయల్స్‌లో చేరవచ్చు. ఈ జట్టు తరఫున ఆడిన రాహుల్ ద్రవిడ్ చాలా కాలం పాటు ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా సేవలందించాడు. ప్రస్తుతం రాజస్థాన్ టీమ్‌తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడవచ్చని నివేదికలో పేర్కొంది.

రాజస్థాన్‌తో రాహుల్ కెరీర్:
51 ఏళ్ల రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌ జట్టులో కెప్టెన్‌గా సేవలందించాజు. 2013 ఛాంపియన్స్ లీగ్ T20 ఫైనల్‌కు జట్టును తీసుకెళ్లాడు. ద్రవిడ్ కోచ్ గా ఉన్నప్పుడు కూడా రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకుంది. అతను 2014, 2015 సంవత్సరాల్లో ఈ బృందంతో మెంటార్‌గా పనిచేశాడు. 

Advertisment
తాజా కథనాలు