Shivraj Singh: ఎమ్మెల్యే పదవికి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ రాజీనామా!

కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గ ఎమ్మెల్యే గా రాజీనామా చేశారు.ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

New Update
Shivraj Singh: ఎమ్మెల్యే పదవికి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ రాజీనామా!

Shivraj Singh Chouhan Resigns: కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) బుధని నియోజకవర్గ ఎమ్మెల్యే గా (Budhani MLA) రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. జూన్ 9న కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలను మోదీ శివరాజ్‌ సింగ్‌ కు కేటాయించారు.

దీంతో మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బుధని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేటప్పుడు తాను చాలా భావోద్వేగానికి గురయ్యానని ఈ సందర్భంగా శివరాజ్‌ వివరించారు.

బుధని నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా సేవలందించానని, ప్రజల అభిమానం చూరగొనేందుకే తన జీవితం అంకితం చేసినట్లుగా పేర్కొన్నారు. తనకు శక్తి ఉన్నంత వరకు ప్రజా సేవకు పునరంకితమవుతానని తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు శివరాజ్ సింగ్ గెలుపొందారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నుంచి 8.21 లక్షలకు పైగా ఓట్లతో ఆయన గెలిచారు.

Also Read: చిరంజీవికి రాజ్య సభ సీటు…సుస్మిత ఏమన్నారంటే!

Advertisment
తాజా కథనాలు