Interior Ideas: మీ ఇల్లు రిచ్ గా కనిపించాలంటే.. ఈ ప్లాంట్స్ తప్పక పెట్టండి..!

మీ ఇల్లు అందంగా, రిచ్ గా, రాయల్ గా కనిపించాలంటే ఈ ఇండోర్ ప్లాంట్స్ తప్పనిసరిగా మీ ఇంట్లో ఉండేలా చూసుకోండి. బెగొనియా, లిల్లీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, అరెక మొక్క

New Update
Interior Ideas: మీ ఇల్లు రిచ్ గా కనిపించాలంటే.. ఈ ప్లాంట్స్ తప్పక పెట్టండి..!

Interior Ideas: ఇళ్ళు అందంగా కట్టుకోవాలి అనేది అందరికి ఒక డ్రీమ్. ఈ మధ్య కాలంలో రకరకాల ఇంటీరియర్స్, ఫర్నిచర్ తో ఇంటిని చాలా అందంగా డిజైన్ చేసుకుంటున్నారు. కొంత మంది తమ ఇంటిని వాళ్ళ సొంత ఆలోచనలతో డిజైన్ చేసుకుంటే.. మరి కొంత మంది కొన్ని వేలు ఖర్చు పెట్టి మరీ డిజైనర్స్ తో ఇంట్లోని ఇంటీరియర్స్ చాలా అందంగా డిజైన్ చేయించుకుంటున్నారు. ఇల్లు అందంగా కనిపించడానికి ఇంట్లో.. వాల్ పేపర్స్, వాల్ హ్యాంగర్స్, మొక్కలు ఇలా రకరకాల ఐడియాస్ ఫాలో అవుతుంటారు. ఇవ్వన్నీ కాకుండ.. మీ ఇల్లు అందంగా, డెకరేటివ్ అండ్ రిచ్ గా కనిపించాలంటే ఈ సింపుల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ను మీ ఇంట్లో పెట్టండి చాలు.

అరెక మొక్క

మీ లివింగ్ రూమ్ లో ఏదైనా ప్లాంట్ పెట్టాలని ప్లాన్ ఉంటే.. అరెక మొక్క బెస్ట్ అప్షన్. అంతే కాదు ఈ మొక్క ఇండోర్ లో చాలా ఈజీగా జీవించగలదు. పెద్దగా, గుబురుగా ఉండే దీని ఆకులు ఇంటి కార్నర్స్ లో పెట్టడం వల్ల ఖాళీ స్పెస్ ను ఆక్రమించి ఇల్లు అందంగా కనిపించేలా చేస్తుంది. ఈ మొక్క చూడడానికి కూడా చాలా అందంగా, రిచ్ గా కనిపిస్తుంది.

స్నేక్ ప్లాంట్

ఈ ప్లాంట్ ఇంటికి ఆభరణంలా చాలా అందంగా కనిపిస్తుంది. పొడవుగా, కత్తి ఆకారంలో ఉండే దీని ఆకులు ఇంటికి మరింత అందాన్ని ఇస్తాయి. వీటిని ఇంట్లో పెట్టేటప్పుడు ఏదైనా గట్టి పాట్ లో ఉంచండి.

publive-image

స్ట్రింగ్ ఆఫ్ పర్ల్

ఈ మొక్క గుబురుగా ఉండి.. ఇది ఒక ముత్యాల తీగలా వేలాడుతూ అందంగా కనిపిస్తుంది. ముత్యాల కనిపించే వీటి ఆకులు కళ్ళకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇంట్లో ఎత్తైన గోడలకు వీటిని హ్యాంగ్ చేస్తే చూడడానికి చాలా అందంగా, డెకరేటివ్ గా కనిపిస్తుంది.

లిల్లీ ప్లాంట్

సహజంగానే లిల్లీ మొక్క చాలా అందంగా ఉంటుంది. ఈ లిల్లీ మొక్కల నిగనిగలాడే ఆకులు, అరమ్ ఆకారంలో ఉండే పువ్వులు ఇంటికి మరింత అందాన్ని ఇస్తాయి. ఇంట్లో లివింగ్ రూమ్ లోని టేబుల్ పై పెడితే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

బెగొనియా

మీ ఇల్లు కలర్ ఫుల్ గా కనిపించాలంటే .. తప్పనిసరిగా ఈ మొక్కను మీ ఇంట్లో పెట్టండి. దీని అందమైన, రంగురంగుల ఆకులు ఇంటికి మరింత అందాన్ని పెంచుతాయి. బెడ్ రూమ్, లివింగ్ రూమ్ దీన్ని ఎక్కువగా పెట్టండి.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు