Poonam Kaur: జనసేన-టీడీపీ సీట్లపై నటి పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్..!

జనసేన-టీడీపీ సీట్లు ప్రకటించగానే.. కుక్క ఫొటోని తన ట్విట్టర్‌లో షేర్ చేసింది నటి పూనమ్ కౌర్. దీంతో వైసీపీ సోషల్ మీడియా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు. పూనమ్ భలే టైమ్ కి కుక్కను వదిలిందంటూ ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.

New Update
Poonam Kaur: జనసేన-టీడీపీ సీట్లపై నటి పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్..!

Actress Poonam Kaur: టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ప్రకటించడంతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కౌంటర్లు వేస్తూ నానా హంగామా చేస్తున్నారు. జనసేనకు పావలా వంతు సీట్లు కూడా చంద్రబాబు ఇవ్వలేదని..24 సీట్లతో ఎవరి మీద యుద్ధం చేస్తావ్.. నువ్వు ఎలా సీఎం అవుతావ్ అంటూ చురకలు వేస్తున్నారు.

Also Read: అలా ఇస్తే లక్కీ నంబర్..ఇలా ఇస్తే పావలా.. జనసేనకు ఆర్జీవీ పంచులు!

ఇదిలా ఉండగా.. జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసినటువంటి తరుణంలో నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. జనసేన-టీడీపీ సీట్లు ప్రకటించగానే.. కుక్క ఫొటోని తన ట్విట్టర్‌లో షేర్ చేసింది పూనమ్ కౌర్. పాత సినిమాలో హీరోయిన్ శ్రీదేవి కుక్కని ఆడిస్తూ ఉన్న ఫొటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో వైసీపీ సోషల్ మీడియా భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ మొదలుపెట్టారు. పూనమ్ భలే టైమ్ కి కుక్కను వదిలిందంటూ ఈ పోస్ట్ పై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పవన్ - బాబు సీట్ల వ్యవహారంపైనే  పూనం కౌర్ స్పందించిందంటూ పోస్ట్ లు పెడుతున్నారు. కుక్కకి బిస్కెట్లు వేసినట్లు అర్దం వచ్చేలా పూనం కౌర్ కుక్క ఫోటీ పోస్ట్ చేసిందని ఎగతాలి చేస్తున్నారు.

#actress-poonam-kaur
Advertisment
తాజా కథనాలు