TDP: వారిపై కఠిన చర్యలు తీసుకోండి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అచ్చెన్నాయుడు లేఖ..! రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనపై లేఖలో వివరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. By Jyoshna Sappogula 20 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి TDP Atchannaidu Letter: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనపై లేఖలో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఘటనకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడాన్ని ఈసీ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు. మీడియాపై కేసులు ఎత్తేసి, కేసును తప్పుదారి పట్టించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. Also Read: ఛీ..నువ్వేం తల్లివి.. మహిళ ప్రాణం తీసిన ట్రోలింగ్..!! లేఖలోని అంశాలు :- • 'రాష్ట్రంలో ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరిగిన హింసపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. • హింసను అరికట్టడంలో విఫలమైన కొందరు పోలీసులపై ఎన్నికల కమిషన్ చర్యలు కూడా తీసుకుంది. ఈ క్రమంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విశాఖలో పోలీసులు మీడియాపైనే కేసులు పెట్టి బెదిరిస్తున్నారు. • విశాఖపట్నంలోని కంచరపాలెంలో వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంతో మహిళలపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. • వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంతోనే తమపై దాడి జరిగిందని బాధితులు చెప్తున్నారు. • బాధితులు చెప్పిన విషయాన్నే మీడియా కూడా ప్రచురించింది. ఈ ఘటనపై విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు కూడా మీడియా సమావేశం నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. • కానీ పోలీసులు మాత్రం వైసీపీ నేతలతో కలిసి దాడి ఘటనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. • బాధితుల గళం వినిపించిన పలు మీడియా సిబ్బందితో పాటు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుపైనా కేసులు నమోదు చేశారు. • దాడి ఘటనను మీడియా ద్వారా రిపోర్ట్ చేయడమే నేరమన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. • ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రసారం చేయడం తప్పెలా అవుతుంది? • ప్రాథమిక హక్కులను కాలరాస్తూ మీడియాపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకునేలా ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలి. • విశాఖలో ఎన్నికల అనంతరం హింసను అదుపుచేయడంలో విఫలమైన పోలీసు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. • అలాగే అక్రమ కేసులతో మీడియా గళాన్ని నొక్కే ప్రయత్నం చేసిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి'. ఈ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి పంపించారు అచ్చెన్నాయుడు. #achchennaidus-letter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి