Accidents Prevention: దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కొత్త కారు భద్రతా నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) దీని కోసం ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. దీనిలో ప్రయాణీకులు వాణిజ్య వాహనాల్లోని కొన్ని విభాగాలలో అంతర్నిర్మిత ఘర్షణ హెచ్చరిక(Built-in collision warning) క్రాష్ అయ్యే అవకాశం ఉందనే సిగ్నల్స్ పంపించే వ్యవస్థను ఇన్ బిల్ట్ గా అమరుస్తారు.
ఈ ఘర్షణ హెచ్చరిక సిగ్నల్‌ను(Accidents Prevention) మూవింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (MOIS) అంటారు. దీని ద్వారా వాహనం ఢీకొనే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరిక అందుతుంది. పాదచారులు సైక్లిస్టులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నపుడు డ్రైవర్లను హెచ్చరించడానికి MOIS సహాయం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రమాణాలు సెట్ చేస్తున్నారు..
ప్రస్తుతం తీసుకువచ్చిన ముసాయిదా అప్రూవ్ పొందిన తర్వాత, వాహన తయారీదారులు VRU ద్వారా తయారు అయిన సూచనల ఆధారంగా అంతర్గత ఘర్షణ నిరోధక యంత్రాంగాలను అభివృద్ధి చేయడానికి ప్రమాణాలను సెట్ చేయాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ఎంత ఎక్కువ వైరుధ్యాలను ఈ వ్యవస్థ గుర్తించగలిగితే అంత వరకూ దీనిని విస్తరించడానికి ప్రమాణాలను సెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: రామాయణం చెప్పే ఫైనాన్షియల్ పాఠాలు ఇవే.. డబ్బు లెక్కలకూ రామకథ ఆదర్శమే!
గత ఏడాది దేశంలో 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు
MORTH నివేదిక ప్రకారం గత ఏడాది భారతదేశంలో మొత్తం 4,61,312 రోడ్డు ప్రమాదాలు జరగ్గా అందులో 1,68,491 మంది మరణించారు. ఈ ప్రమాదాల్లో దాదాపు 4.45 లక్షల మంది గాయపడ్డారు. దీంతో వాహనాల్లో ఘర్షణ హెచ్చరిక సిగ్నల్‌లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకువచ్చారు.
భారతదేశంలో చాలా రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి. 2022లో జరిగిన దాదాపు 75% ప్రమాదాలకు ఇదే కారణం. ఏడాదిలోగా రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించడమే తమ మంత్రిత్వ శాఖ లక్ష్యమని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
హెచ్చరిక తో డ్రైవర్‌కు ప్రతిస్పందించే అవకాశం..
ఘర్షణ హెచ్చరిక సిగ్నల్ పాదచారులు లేదా సైకిల్‌తో ఢీకొనే అవకాశం ఉన్న సందర్భంలో హెచ్చరికను పంపుతుంది. డ్రైవర్‌కు బ్రేక్‌లు వేయడానికి లేదా పక్కకు వాహనాన్ని తీయడానికి సమయం ఇస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాలలో లేదా అకస్మాత్తుగా వాహనం ముందు వ్యక్తులు వచ్చినప్పుడు జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ఈ వ్యవస్థ సహాయపడుతుంది.