Chandrababu house arrest updates: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును హౌస్ కస్టడీ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. హౌస్ రిమాండ్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరపున లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరపున పొన్నవోలు వాదనలు వినిపించారు. ప్రాణ హాని ఉంది వెసులుబాటు కల్పించాలని లూథ్రా వాదించారు. NSG సెక్యూరిటీ ఉందని హౌస్ అరెస్ట్ అడుగుతున్నామన్నారు లూథ్రా. రాజమండ్రి జైలే చంద్రబాబుకు సేఫ్టీ అని పొన్నవోలు చెబుతున్నారు. చంద్రబాబు బయటకు వెళ్తే కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉందంటున్నారు.
కోట్ చేసిన కేసులకు సంబంధించి వివరాలు అడిగారు న్యాయమూర్తి. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు క్లారిఫికేషన్ కోరింది. కొన్ని అంశాలపై మరిన్ని వివరాలు అడిగారు న్యాయమూర్తి.
సీసీ కెమెరాలున్నాయి:
ఏసీబీ కోర్టులో ముందుగా వాదనలు వినిపిస్తున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయన ఆరోగ్య కారణాలను పరిశీలించాలన్నారు. సెంట్రల్ జైలులో అన్ని విధాలా భద్రత ఉందని.. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. చంద్రబాబు భద్రతపై అన్ని చర్యలు తీసుకున్నామని.. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ కంటే అదనపు సెక్యూరిటీ పెట్టినట్టు చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటికంటే జైలే సేఫ్ ప్లేస్ అన్నారు. పొన్నవోలు వాదనల తర్వాత లూథ్రా తన వాదనలు వినిపించారు జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. జైలులో కరుడుకట్టిన నేరగాళ్లు ఉంటారన్నారు. ప్రభుత్వం ఆయన సెక్యూరిటీ తగ్గించిందని చెబుతున్నారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ అమలులో ఉందని.. చంద్రబాబుకు కేంద్రం హై సెక్యూరిటీ కల్పించిందన్నారు. గౌతమ్ నవలక వర్సెస్ ఎన్‌ఐఏ( NIA 2021) కేసులో హౌస్ రిమాండ్ ఇవ్వవచ్చు అని సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేశారు.
అందరూ టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్:
భారీ పోలీసు మోహరింపు, సిఆర్‌పిసి సెక్షన్ 144 ని ధిక్కరిస్తూ, ప్రజల సభలను నిషేధిస్తూ, తెలుగుదేశం పార్టీ (టిడిపి) కార్యకర్తలు, మద్దతుదారులు టిడిపి పిలుపునిచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా వివిధ ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకారులను పోలీస్ స్టేషన్లకు తరలించారు. 2014-19లో ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన కోట్లాది రూపాయల ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలోరాష్ట్ర సీఐడీ శనివారం తెల్లవారుజామున నంద్యాల నుంచి అరెస్టు చేసింది . విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు ఆదివారం సాయంత్రం నాయుడును 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కోర్టు ఆదేశాల మేరకు విజయవాడకు 200 కిలోమీటర్ల దూరంలోని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లోనే ఉన్నారు చంద్రబాబు.
ALSO READ: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఒంటరిగానే చంద్రబాబు.. కలవని కుటుంబసభ్యులు!