/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/acb-jpg.webp)
Ananthapuram: శ్రీ సత్యసాయి జిల్లాలో ఏసీబీ వలలో ఇద్దరూ అవినీతి తిమింగళాలు దొరికారు. మడకశిర సబ్ రిజిస్టార్ కార్యాలయంపై ఏసీబీ అదికారులు దాడులు నిర్వహించారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన 8 ఎకరాల 32 సెంట్లు స్థలం రిజిష్టర్ చేయడానికి బేరం కుదుర్చుకున్నారు సబ్ రిజిస్టర్ దామోదర్ రెడ్డి, రైటర్ షమీవుల్లా. రూ. 2,50,000/- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు వారిఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వెంకటాద్రి నేతృత్వంలో అనంతపురం, కర్నూలు జిల్లాలో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు.