AB Venkateswara Rao: ఈ అవకాశం నాకు మాత్రమే వచ్చింది.. AB వెంకటేశ్వర రావు ఎమోషనల్.. !

AB వెంకటేశ్వర రావు ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా నేడు బాధ్యతలు స్వీకరించారు. అయితే, బాధ్యతలు తీసుకున్న రోజే పదవీ విరమణ చేయడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల తరువాత ముత్యాలంపాడు ఆఫీస్ లో చార్జ్ తీసుకోవడం విశేషంగా మారింది.

New Update
AB Venkateswara Rao: ఈ అవకాశం నాకు మాత్రమే వచ్చింది.. AB వెంకటేశ్వర రావు ఎమోషనల్.. !

AB Venkateswara Rao:  AB వెంకటేశ్వర రావు ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ రోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. రెండు సంవత్సరాల తరువాత ముత్యాలంపాడు ఆఫీస్ లో చార్జ్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అయితే, పదవీ బాధ్యతలు తీసుకున్న రోజే పదవి విరమణ చేయడం బాధగా ఉందని.. ఈ అవకాశం నాకు మాత్రమే వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: అష్టదిగ్బంధంలో కడప.. వారిపై అధికారుల డేగ కన్ను..

కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నానన్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో తాను ఉన్నాను.. ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఇంతకాలం తనకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటానని కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. యూనిఫాంతో రిటైర్ కావడం కల నెర వేరినట్లుగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు