Crime: అతి దారుణం.. నడిరోడ్డులో మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి..

బెంగాల్‌లో ఘోరం చోటుచేసుకుంది. నడిరోడ్డులో ఓ మహిళపై TMC నేత తజ్ముల్‌ హక్‌ కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళ జుట్టుపట్టుకొని కాళ్లతో తన్నుతూ..కర్రలతో దారుణంగా కొట్టాడు. నిందితుడు తజ్ముల్‌హక్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

New Update
Crime: అతి దారుణం.. నడిరోడ్డులో మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి..

West Bengal: మహిళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్న ప్రయోజనం లేకుండా పోయింది. దేశంలో మహిళపై జరుగుతున్న దాడులను ఏ చట్టం ఆపడం లేదు. తాజాగా, నడిరోడ్డులో ఓ మహిళపై కర్రలతో విచక్షణారహితంగా దాడి జరిగింది. ఈ ఘోరమైన ఘటన బెంగాల్‌లో చోటుచేసుకుంది. మహిళతో పాటు మరో వ్యక్తిని ఇష్టమొచ్చినట్టు చితకబాదాడు నిందితుడు TMC నేత తజ్ముల్‌ హక్‌ అలియాస్‌ JCB.

Also Read: అమలులోకి దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు.. వివరాలివే!

వద్దు..కొట్టొద్దు అంటూ ఆ మహిళ ఎంత బ్రతిమాలినా తజ్ముల్‌ కనికరించలేదు. కర్ర విరిగిపోయినా నిందితుడు వదలలేదు.
మహిళ జుట్టుపట్టుకొని కాళ్లతో తన్నుతూ..కర్రలతో ఘోరంగా కొట్టాడు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగినా ఎవ్వరూ కూడా వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. బెంగాల్‌ ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాలోని చోప్రాలో ఈ దారుణం జరిగింది. ఘటనపై సమాచారం అందుకున్న బెంగాల్‌ పోలీసులు నిందితుడు తజ్ముల్‌హక్‌ను అరెస్ట్‌ చేశారు. కాగా, బెంగాల్‌లో మమతా బెనర్జీ పాలనకు ఇదే నిదర్శనం అంటూ బీజేపీ ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. మమతా బెనర్జీ పాలనలో అరాచకమని బీజేపీ ఫైర్‌ అవుతోంది.

Also Read: నిండైన తెలుగుదనం..చురుకైన వాగ్ధాటి కి పుట్టినరోజు!

బెంగాల్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా మమతా బెనర్జీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు సందేశ్‌ఖాళీలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని..TMCనేత షాజహాన్‌ షేక్‌ మహిళలను లైంగికంగా వేధించేవాడని.. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలించాడని ఆరోపణలు వినిపించాయి. ప్రభుత్వం షాజహాన్‌కు అండగా నిలిచినట్టు.. తాజా ఘటనలోనూ నిందితుడిని సమర్థిస్తారా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామంటోంది.

Advertisment
తాజా కథనాలు