రూమ్ షేరింగ్ పేరుతో కుర్రాడికి షాక్ ఇచ్చిన మహిళ.. ఏం చేసిందంటే!

సాఫ్ట్ వేర్ అబ్బాయితో రూమ్ షేర్ చేసుకుంటున్న ఓ మహిళా దారుణానికి పాల్పడింది. గదిలో చేరిన కొంతకాలానికి తన అసలు రంగు బయటపెట్టింది. లైంగిక దాడి పేరుతో అతనినుంచి రూ.4.7లక్షలు వసూల్ చేసింది. తర్వాత భౌతిక దాడులు చేయించింది. ఈ సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

New Update
రూమ్ షేరింగ్ పేరుతో కుర్రాడికి షాక్ ఇచ్చిన మహిళ.. ఏం చేసిందంటే!

రూమ్ షేరింగ్ పేరుతో ఓ మహిళ సాఫ్ట్‌వేర్ కుర్రాడికి ఊహించని షాక్ ఇచ్చింది. గదిలో చేరేముందు తన గురించి పూర్తి అబద్దాలు చెప్పిన ఖిలాడీ ఆ తర్వాత అసలు రంగు బయటపెట్టింది. అన్యాయం అని ఆ అబ్బాయి వాదిస్తే భౌతిక దాడులు చేయిస్తానని బెదిరించింది. అయినా అతడు లొంగపోవడంతో చివరికి లైంగిక దాడి కేసు పెట్టి పెద్ద మొత్తంలో డబ్బులు వసూల్ చేసింది.

ఈ మోసపూరితమైన సంఘటన హైదరాబాద్ లోని మధురానగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకోగా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన సి.కిరణ్‌కుమార్‌ కృష్ణానగర్‌లో ఏడాది క్రితం ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అయితే ఒక్కడే ఉండలేక తనతో పాటు రూమ్‌ షేర్‌ చేసుకోవడానికి ఆసక్తిగల వారు సంప్రదించాలని ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చాడు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఓ మహిళ ఆసక్తి చూపి అతని గదిలో చేరింది. ఆ తర్వాత వీరిద్దరూ కృష్ణానగర్‌ రూమ్ ఖాళీచేసి కూకట్‌పల్లికి మకాం మార్చారు.

Also read : రవితేజ ఫ్యాన్స్​కు సడెన్ సర్ ప్రైజ్.. ఓటీటీలో ‘టైగర్ నాగేశ్వరరావు’

అయితే కాలక్రమంలో ఆ మహిళ అసలు రూపం బయటపడింది. తాను వేశ్యనని కిరణ్ కు చెప్పడంతో వెంటనే గది ఖాళీ చేయమని కోరాడు. కానీ ఆమె నిరాకరించింది. బలవంతంగా వెళ్లగొడితే సన్నిహితంగా ఉన్న తమ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది. దీంతో ఇద్దరిమధ్య గొడవ పెద్దది కావడంతో.. కిరణ్‌ తనపై లైంగిక దాడి చేశాడంటూ సైబరాబాద్‌ షీ టీమ్ ను ఆశ్రయించింది. దీంతో ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు అతని నుంచి రూ.4.7లక్షలు పరిహారం కింద ఆమెకు ఇప్పించారు. ఇంతటితో ఇష్యూ ముగిసిందని అబ్బాయి అనుకునే లోపు మరో షాక్ ఇచ్చింది. రూమ్ లో తామిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలు నెట్టింట పోస్ట్ చేసింది. అవికాస్త వైరల్ కావడంతో కిరణ్‌కుమార్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వాటిని తొలగించారు. ఇంతటితో వదిలిపెట్టని ఖిలాడీ ఆ తర్వాత నవంబర్ 13న రాత్రి 9గంటల ప్రాంతంలో కిరణ్ పై దాడి చేయించింది. దీంతో కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై వెంటనే చర్యలు చేపట్టి బాధితుడికి న్యాయం చేస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు