/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ambati.png)
Minister Ambati: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేశారు కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, MPTC అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ పార్టీలో ఇమడలేక రాజీనామా చేస్తున్నామన్నారు. వైసీపీ పార్టీ కోసం 4ఎకరాలు సొంత భూమి అమ్ముకున్నానని.. అయితే, తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని వాపోయారు. పదవి ఉన్నా సామాన్య కార్యకర్తగానే ఉన్నానన్నారు.