Crime News: ఛీ..నువ్వేం తల్లివి.. మహిళ ప్రాణం తీసిన ట్రోలింగ్‌..!!

నెల కిందట చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌ బాల్కనీలో ఇరుక్కుపోయిన చిన్నారిని అపార్ట్‌మెంట్ వాసులు చాకచక్యంగా కాపాడారు. చిన్నారిని కాపాడిన వీడియో వైరల్ అయింది. దీంతో నువ్వేం తల్లివి..? పాప బిల్డింగ్‌ పైనుంచి పడిపోతే సోయి లేకుండా ఉన్నావా? అంటూ ట్రోల్ చేయడంతో రమ్య ఆత్మహత్య చేసుకుంది.

Crime News: ఛీ..నువ్వేం తల్లివి.. మహిళ ప్రాణం తీసిన ట్రోలింగ్‌..!!
New Update

Mother died due to Social Media Trolls: ట్రోలింగ్‌ ఓ మహిళ ప్రాణం బలితీసుకుంది. తన బిడ్డను సరిగ్గా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో ఓ తల్లిపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఆ విమర్శలు, అవమానాలు భరించలేక ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

Also Read: రేవ్ పార్టీలో సంచలన విషయాలు.. టాలీవుడ్ హీరో, ఏపీ మంత్రి సన్నిహితులు?

చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రమ్య (33 ), సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ తన కుమార్తెతో నివాసం ఉంటుంది. అయితే, ఇటీవల ఏప్రిల్ 28న తన చిన్నారి ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తులో పడిపోయి బాల్కనీలో ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమయిన అపార్ట్‌మెంట్ వాసులు చాకచక్యంగా ఆ చిన్నారిని కాపాడారు. అంతవరకు బాగానే ఉంది. అయితే, చిన్నారిని కాపాడిన వీడియో వైరల్ అయింది. దీంతో చిన్నారి తల్లిపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేశారు.

Also Read: రాష్ట్రంలో అల్లర్లు జరగడానికి కారణం ఇదే.. సిట్ సంచలన నివేదిక..!

నువ్వేం తల్లివి..? పాప బిల్డింగ్‌ పైనుంచి పడిపోతే సోయి లేకుండా ఉన్నావా? అంటూ రమ్యను జనాలు తిట్టిపోశారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ జరగడంతో రమ్య మనస్తాపం చెందింది. వేధింపులు భరించలేక కోయంబత్తూర్‌లోని పుట్టింటికి వెళ్లిన రమ్య ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో వాళ్లు ఇంటికి వచ్చేసరికి రమ్య స్పృహలో లేకపోవటాన్ని గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

#social-media-trolls
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe