చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించే మిల్ మేకర్..! మిల్ మేకర్ ని రోజువారి ఆహారంలో తీసుకుంటే ఇట్టే బరువు తగ్గుతారు. వీటిలో అనేకమైన ఖనిజ లవణాలు ఉన్నాయి. అంతేకాకుండా మాంసాహారం తినలేని వారు వీటిని తీసుకోవటం చాలా సులభంగా అనిపిస్తుంది. By Durga Rao 23 May 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మీల్ మేకర్ లను సోయా గింజల నుండి నూనె తీసిన తరువాత మిగిలిన పిప్పిని ఉపయోగించి తయారు చేస్తారు. మీల్ మేకర్ తో రుచికరమైన వంటకాలను చేయవచ్చు. మీల్ మేకర్ లతో మసాలా కూరలను, మంచురియాను కూడా తయారు చేస్తారు. అలాగే కిచిడి, బిర్యానీ వంటి వాటిల్లో వాడతారు. ఇవి మనఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల మీల్ మేకర్ లో 52 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల ఫైబర్, 35 గ్రాముల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా మోతాదులో తీసుకోరాదు. తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మీల్ మేకర్ లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరిగుతాయి. మగవారు సాధ్యమైన తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది. పురుషులు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారిలో ఛాతి పరిమాణం పెరుగుతుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు, మలబద్దకం, అతిగా మూత్రానికి వెళ్లడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోడిగుడ్లు, పాలు, మాంసంతో సమానమైన ప్రోటీన్ మీల్ మేకర్లలో ఉంటుంది. కండపుష్టి కొరకు వ్యాయామాలు చేసే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మాంసాహారం తినలేని వారికి మీల్ మేకర్ మంచి ఆహారంగా చెప్పవచ్చు. మీల్ మేకర్ లను తరచూ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. వీటిలో ఉండే ప్రోటీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మహిళలు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా నిల్చి వాపులు రావడం, కడుపులో గ్యాస్, మొటిమలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే క్రమంలో శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. రోజూ 25 గ్రాముల మీల్ మేకర్ లను మాత్రమే తీసుకోవాలి. #meal-maker మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి