AP: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..!

AP: విశాఖ జిల్లా అగనంపూడి జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. సూర్య కిరణ్ అనే వ్యక్తిని గంగవరంకు చెందిన కోర్లయ్య కత్తితో దాడి చేసి చంపాడు. భార్య బిడ్డలను చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కోర్లయ్యకు, సూర్య అత్తకు అక్రమ సంబంధం ఉన్నట్టు అనుమానం.

New Update
AP: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..!

Vishaka: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. తిరిగి ఇంటికి వెళ్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖ జిల్లా అగనంపూడి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. మల్కాపురం ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన దాడి సూర్య కిరణ్ ను గంగవరంకు చెందిన కోర్లయ్య కత్తితో దాడి చేసి చంపాడు. ఇటీవలే అగనంపూడి ఆసుపత్రిలో దాడి సూర్య కిరణ్ భార్య ఆడశిశువుకు జన్మనిచ్చింది. భార్యను, పుట్టిన బిడ్డను చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో కోర్లయ్య బైక్ తో ఢీ కొట్టి.. అనంతరం కత్తితో దాడి చేశాడు.

Also Read: ఇతని ఆచూకీ చెప్తే రూ.50వేలు.. పోలీసులు కీలక ప్రకటన!

ఈ ఘటనలో సూర్యకిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు కోర్లయ్య దువ్వాడ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాగా, నిందితుడు కోర్లయ్యకు, దాడి సూర్యకిరణ్ అత్తకు అక్రమ సంబంధం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు