Social Media: ఓరి వీడి ఏశాలో.. టూరిస్టులను వ్యభిచారులుగా పరిచయం చేస్తూ రీల్స్.. నెటిజన్స్ ఫైర్!

సోషల్ మీడియాలో జైపూర్ కు చెందిన ఒక యువకుడు అక్కడకు వచ్చిన టూరిస్టులను వ్యభిచారులుగా చూపిస్తూ రీల్స్ చేస్తున్నాడు. వారికి రేట్లు పెట్టి కావాలంటే తీసుకోండి అని చెబుతూ జుగుప్సాకరంగా రీల్స్ చేస్తున్నాడు. దీనిపై నెటిజన్లు వెంటనే ఆ యువకుడిని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. 

Social Media: ఓరి వీడి ఏశాలో.. టూరిస్టులను వ్యభిచారులుగా పరిచయం చేస్తూ రీల్స్.. నెటిజన్స్ ఫైర్!
New Update

Social Media: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం చాలామందికి ఒక వ్యసనంలా మారిపోయింది. తప్పుడు కథనాలు.. బూతుల పంచాయతీలు.. పనికిమాలిన ఫీట్స్.. నోటికి వచ్చినట్టు వాగడం.. ఇవన్నీ మన దేశంలో చాలా సహజంగా జరిగిపోతున్నాయి. మన దేశంలో సోషల్ మీడియా.. కాస్త అక్షర జ్ఞానం ఉన్నవారికి కోతి చేతిలో కొబ్బరిచిప్పలా తయారైంది. రాజకీయ నాయకుల విషయంలో ఎంత దరిద్రం చూడాలో అంతా సోషల్ మీడియాలో చూస్తున్నాం. కొందరు చేసే వ్యాఖ్యలు దారుణంగా ఉండడం సహజమైపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా అంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది. దేశంలో ప్రతిరోజూ తిట్ల పురాణం.. తప్పుడు కథనాల ప్రచారం సోషల్ మీడియాలో కామన్ అయిపొయింది. అయితే, కొంతమంది యువకులు రీల్స్ కోసం అని చెప్పి దారుణమైన పనులు తెగబడుతున్నారు. కొందరు సాహసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఎదో ఒక విషయంపై వివాదాన్ని సృష్టించి పాప్యులారిటీ చెందడంపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో జైపూర్ లో ఒక యువకుడు చేస్తున్న రీల్స్ దేశ పరువును.. టూరిజం ప్లేసుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. 

Social Media: ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు పేరు @guru__brand0000 అనే ఐడీ ఉన్న  జైపూర్ కు చెందిన ఒక యువకుడు.. అక్కడకు వచ్చిన టూరిస్ట్ మహిళలను కించపరుస్తూ రీల్స్ చేస్తున్నాడు. ఒక రీల్ లో ముగ్గురు విదేశీ యువతులను చూపిస్తూ.. ఈమె రేటు గంటకు 150.. ఈమె రేటు గంటకు 200.. అంటూ చెప్పుకొచ్చాడు. ఆ యువతులకు భాష రాకపోవడంతో తమను చూపిస్తూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నాడు అనుకుని నవ్వుతూ అతనితో మాట్లాడుతున్నారు. మరొక వీడియోలో నడుస్తున్న విదేశీ జంటను చూపించి.. అందులోని అమ్మాయిని ఫ్రెండ్స్ ఈమె నా వైఫ్ అంటూ చెబుతూ రీల్స్ చేస్తూ కనిపించాడు. ఇంకో వీడియోలో ఒక విదేశీ యువకుడిని చూపించి.. ఇతను నాబావ.. ఇతనితో మీరు గడపాలనుకుంటున్నారా? అంటూ చెప్పుకొస్తున్నారు. 

Social Media: ఇలాంటి వీడియోలను చూసిన కొందరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X లో ఆ యువకుడి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను చేసిన వీడియో రీల్స్ ను పోస్ట్ చేస్తూ.. వెంటనే ఆ యువకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్ పోలీసులను ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి వారి వల్ల  మనదేశ పరువు పోతోందని.. టూరిస్టులను వేధించడం వలన జైపూర్ టూరిజంపై మచ్చ పడుతుందని పేర్కొంటూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఆ ట్వీట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు.. 

#scial-media
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe