ATP : కుక్కల దాడికి రెండు గోడల మధ్య చిక్కుకున్న చిన్నారి.. చివరికి... అనంతపురం జిల్లా ఆవుల తిప్పాయపల్లిలో నాలుగేళ్ల చిన్నారికి ప్రమాదం తప్పింది. వీధి కుక్కలు చిన్నారి అవంతికను వెంబడించడంతో భయంతో పరిగెత్తుతూ రెండు గోడల మధ్య చిక్కుకుంది. తల్లిదండ్రుల సమాచారంతో రంగంలోకి దిగిన రెస్క్యూటిమ్.. సురక్షితంగా చిన్నారిని బయటికి తీశారు. By Jyoshna Sappogula 16 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Anantapur : రాష్ట్రంలో పలుచోట్లు వీధి కుక్క(Street Dogs) ల దాడికి చిన్నారులు మృతి చెందిన ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అయినా, వీధి కుక్కల దాడులు నియంత్రించలేని పరిస్థితులు కనిపిస్తునే ఉన్నాయి. తాజాగా, వీధి కుక్క దాడికి ఓ చిన్నారి రెండు గోడల మధ్య చిక్కుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. Also Read: డబ్బెవడికి కావాలి.. అంటున్న సాయిపల్లవి.. మరో సౌత్ సినిమాకు నో! తాడిపత్రి(Tadipatri) మండలం ఆవుల తిప్పాయపల్లి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి(4 Years Kid) కి ప్రమాదం తప్పింది. వీధి కుక్కలు చిన్నారి అవంతిక(Avantika) ను వెంబడించడంతో భయంతో పరిగెత్తుతూ రెండు గోడల మధ్య చిక్కుకుంది. వెంటనే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు రెస్క్యూటిమ్(Rescue Team) కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు .. సురక్షితంగా చిన్నారిని బయటికి తీశారు. దీంrescue తో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా గ్రామంలో వీధి కుక్కల దాడులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. #anantapur-district #rescue-team #street-dogs-attack-on-child మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి