Venkatarami Reddy: బిఆర్ఎస్ కు బిగ్ షాక్..మెదక్ పార్లమెంట్ అభ్యర్థిపై కేసు నమోదు.! బిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మెదక్ లోకసభ స్థానం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారని, ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సిద్ధిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. By Bhoomi 08 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Venkatarami Reddy: బిఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పార్టీలోని బడా నాయకులంతా పక్క పార్టీల్లోకి వెళ్తుంటే..ఉన్న నాయకులపై కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఎలాంటి అనుమతులు లేకుండా సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ఐకేపీ, ఈజీఎస్ ఉద్యోగులతో ఎన్నికలకు సంబంధించిన సమావేశం నిర్వహించినట్లు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సిద్ధిపేట త్రిటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి..తర్వాత వారికి భోజనం కూడా ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎలాంటి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పర్మిషల్ లేదు. నిబంధనల ఉల్లంఘించడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు స్పందించారు. వెంకటరామిరెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని అతనిపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే మళ్లీ చేస్తుందని రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెంకటరామిరెడ్డి సమావేశం అయ్యారని..ఈసీ అనుమతి లేకుండా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ కు తృటిలో తప్పిన ప్రమాదం! #venkatarami-reddy #raghunandan-rao-complaints-ceo #case-register-on-venkatarami-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి